మేము నిలిపివేయలేదు.. వాళ్లే కొనడం మానేశారు..!

బజాజ్ ఆటో తిరిగి స్కూటర్ మార్కెట్‌లోకి ప్రవేశించనుందని ఆ సంస్థ చైర్మన్ రాహుల్ బజాజ్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా రాజీవ్ ఈ మాటలు అన్నారు. అయితే కంపెనీ ఎందుకు స్కూటర్ల ఉత్పత్తిని ఆపివేసిందని అని ప్రశ్నించగా.. రాజీవ్ సమాధానమిస్తూ.. "మేము నిలిపివేయలేదు... ప్రజలే కొనడం మానేశార"ని సమాధానమిచ్చారు. ప్రపంచ మోటార్‌సైకిల్ మార్కెట్ స్థానం 350 లక్షల యూనిట్లని, ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి తమ కంపెనీ 35 లక్షల మోటార్‌సైకిళ్లను విక్రయిస్తుందని రాజీవ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమకు పది శాతం మార్కెట్ వాటా ఉందని, ప్రస్తతుతం మిగిలిన 90 శాతం వృద్ధిని సాధించే లక్ష్యంలో ఉన్నామని ఆయన తెలిపారు.
ఏప్రిల్ 2010 - జనవరి 2011 నాటికి బజాజ్ దేశీయ మార్కెట్లో 19,89,377 బైక్‌లను విక్రయించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి బజాజ్ విక్రయాలు 14,11,259 యూనిట్లుగా ఉన్నాయి. అంటే ఒక్క సంవత్సరంలో కంపెనీ 40.96 శాతం వృద్ధిని సాధించిందన్నమాట. అలాగే బజాజ్ విదేశీ విక్రయాలు కూడా గతేడాదితో పోలిస్తే.. 35.78 శాతం వృద్ధి చెంది 6,16,135 యూనిట్ల నుంచి 8,36,617 యూనిట్లకు పెరిగాయి. గత డిసెంబర్ 2009లో స్కూటర్ల ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు బజాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








