హోండా ఆక్టివాకు ఎందుకంత ప్రజాదరణ..?

Honda Activa
ప్రస్తుతం దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో స్కూటర్ విభాగంలో 'ఏక్ నిరంజన్'గా ఉన్న హోండా మోటార్ కంపెనీ ముద్దుల స్కూటర్ "హోండా ఆక్టివా"కు అత్యంత ప్రజాదరణ లభించడానికి కారణం ఏంటి..? ఇందులో ఉన్న ప్రత్యేకల గురించి ఓ లుక్కేయండి మరి..!

స్కూటర్‌ అనగానే.. మనకు టక్కున గుర్తుకు వచ్చేది బజాజ్ స్కూటర్.. ఒకప్పుడు స్కూటర్ల విభాగానికే డాన్‌గా ఉన్న బజాజ్ ప్రస్తుతం చరిత్రలో కలిసిపోయింది. అయితే బజాజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో కంపెనీలు తమ తమ స్కూటర్లను మార్కెట్లో ప్రవేశపెట్టారు, ఇంకా పెడుతూనే ఉన్నారు కూడా..!

కానీ మార్కెట్లోకి ఎన్ని కొత్త మోడళ్లు వచ్చినా ప్రస్తుతం "హోండా ఆక్టివా"నే నంబర్ వన్ స్కూటర్‌గా నిలుస్తుంది. 2000 సంవత్సరం భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఆక్టివా మోస్ట్ పాపులర్ స్కూటర్‌గా పేరు తెచ్చుకోవడానికి చాలానే కారణాలున్నాయి.

సౌకర్యవంతమైన ప్రయాణం, స్టైలిష్ లుక్ ఆక్టివా విజయానికి ప్రధాన కారణాలు. విశాలమైన సీట్, ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ, మంచి పికప్ వంటి ఎన్నో సదుపాయాలు ఆక్టివా ఆక్టివ్‌నెస్‌కు కారణమయ్యాయి. దీనిని కంట్రోల్ చేయడం (స్త్రీలకు, పురుషులకు) చాలా సులువుగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆక్టివాలో ప్రయాణిస్తుంటే.. ఓ చిన్నసైజు కారులో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. మరి దీని సాంకేతిక వివరాలను తెలుసుకోండి....

ఇంజన్ టైప్ - 4 స్ట్రోక్
ఇంజన్ సీసీ - 102 cc
ఇంజన్ కూలింగ్ టైప్ - ఎయిర్ కూల్డ్
సిలిండర్స్ - సింగిల్ సిలిండర్
గరిష్ట పవర్ - 8 bhp (6.0 kW) at 7500 rpm
గరిష్ట టార్క్ - 0.9 kg-m at 5500 rpm
స్టార్టింగ్ - సెల్ఫ్ స్టార్ట్, కిక్ స్టార్ట్
గేర్లు - లేవు
ఇంధన ట్యాంక్ సామర్థ్యం - ఆరు లీటర్లు
బ్యాటరీ - 12V, 5Ah
సీటు ఎత్తు - 765 mm
వీల్‌బేస్ - 1238 mm
గ్రౌండ్ క్లియరెన్స్ - 145 mm
బ్రేక్స్ - డ్రమ్ బ్రేక్స్

హోండా ఆక్టివాలో ప్లస్‌లతో పాటు కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి. అందులో మొట్ట మొదటిది మైలేజ్. హోండా ఆక్టివా సిటీ రోడ్లపై లీటరు పెట్రోల్‌కు 40 కిలోమీటర్ల మైలేజ్‌ని, హైవే రోడ్లపై 45 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. దీని డ్రమ్ బ్రేక్స్ రైడర్లకు అంత సంతృప్తినీయవు. ఇక ఆక్టివా ధర విషయానికి వస్తే.. ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్) ధర రూ. 45,275 గానూ... ఆన్ రోడ్ (హైదరాబాద్) ధర రూ. 50,488 గానూ ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, February 18, 2011, 12:45 [IST]
English summary
Honda Activa made its entry in Indian market at 2000. Now Honda Activa becomes the most popular scooter in India. Its comfort ability and stylish looking is the major part of its success.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+