డీజిల్ బుల్లెట్ బైక్‌లను పునఃప్రవేశపెట్టనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్!

Royal Enfield
ప్రముఖ లీజర్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలో భారత మార్కెట్ కోసం డీజిల్‌తో నడిచే మోటార్‌సైకిళ్లను పునఃప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రపంచంలోని వివిధ ప్రీమియం బైక్‌ తయారీ సంస్థలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మోటార్‌సైకిళ్లను భారత్‌లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ పోటీతత్వ వాతావరణాన్ని తట్టుకుని నిలబడేందుకు భారతదేశపు అతిపురాతన కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ అభివృద్ధి చేసిన డీజిల్ ఇంజన్ మోటార్‌సైకిళ్లను విడుదల చేయనున్నట్లు సమాచారం.

చెన్నై కేంద్రంగా ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్, భవిష్యత్తులో 750 సీసీ ఇంజన్ కలిగిన మోటార్‌సైకిళ్లను కూడా భారత్‌కు పరిచయం చేయాలని భావిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుండి మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న బుల్లెట్ (డుగు.. డుగు.. మోటార్‌సైకిల్) బైకులకు భారతీయుల నుండి ఇప్పటికీ అశేష ఆదరణ లభిస్తోంది. దేశంలోకి ఎన్ని విదేశీ మోడళ్లు వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారు చేసే క్లాసిక్ మోటార్‌సైకిళ్లకు సాటి రావనే చెప్పొచ్చు.

మనదేశంలో అత్యల్పంగా మోటార్‌సైకిళ్లను తయారు చేసే కంపెనీ కూడా రాయల్ ఎన్‌ఫీల్డే. ఈ బైక్‌లకు కంపెనీ ఉత్పత్తికి మించిన డిమాండ్ ఉంది. అయినప్పటికీ.. కంపెనీ ఏటా 75,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు చెన్నైలో మరో ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ రేంజ్‌లో అందిస్తున్న కొన్ని రకాల మోడళ్లకు వివిధ ప్రాంతాల్లో దాదాపు 12 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది.

అంటే ఈ మోడళ్లకు అంత డిమాండ్ అన్నమాట. ఏదైతేనేం, పెట్రోల్ ధరలు భగ్గుమంటున్న నేటి రోజుల్లో ఇలాంటి డీజిల్ బైక్‌ల ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. త్వరలోనే రాయల్ ఎన్‌ఫీల్డ్ మన కోసం డీజిల్ మోటార్‌సైకిళ్లను పునఃప్రవేశపెట్టాలని కోరుకుందాం..!!

More from DriveSpark

Article Published On: Saturday, October 1, 2011, 13:34 [IST]
English summary
According to reports, the Delhi-based Eicher Motor's liesure motorcycle manufacturer Royal Enfield is thinking to relaunch the diesel variant bike soon for Indian market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+