ఐప్యాడ్ కలిగిన కారును పరిచయం చేయనున్న ల్యాండ్ రోవర్

ఐప్యాడ్ కారు ఏంటి..? వినడనాకి కొత్తగా ఉంది అనుకుంటున్నారా...? మరి చూడటానికి ఎలా ఉంటుందనే కదా.. మీ సందేహం. అయితే ఈ కథనం చదవండి. మ్యూజిక్ సిస్టమ్‌లలో ఐప్యాడ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. మ్యూజిక్ లవర్స్‌కు ఐప్యాడ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇటువంటి హై-డెఫినెషన్ మ్యూజిక్ సిస్టమ్ మీ కారులో ఉంటే.. మీ చెవులకు అత్యుత్తమ సంగీతాన్ని అందించవచ్చు. ఈ విధానికి తొలిసారిగా ఇంగ్లాండ్‌కు విలావంతమైన (లగ్జరీ) కార్ల తయారీ సంస్థ ల్యాండ్ రోవర్ శ్రీకారం చుట్టింది.

కారును తయారుచేసే సమయంలో అందులో ఇన్‌బిల్ట్ ఐప్యాడ్ మ్యూజిక్ సిస్టమ్‌ను అమర్చిన మొట్టమొదటి కారుగా ల్యాండ్ రోవర్ చరిత్రకెక్కనుంది. పరిమిత సంఖ్యలో మాత్రమే తయారుచేస్తున్న రేంజ్ రోవర్ లగ్జరీ కారు 4డబ్ల్యూడిలో ఈ వ్యవస్థను అమర్చనున్నట్లు సమాచారం. ఈ కారులో సీటు వెనక భాగంలో పూర్తి టచ్‌స్క్రీన్‌తో కూడిన పోర్టబుల్ ఐప్యాడ్‌లను అమర్చడం జరుగుతుంది. దీని ద్వారా వెనుక సీటులో కూర్చున్న ప్రయాణికులు సినిమాలు చూడవచ్చు, మ్యూజిక్ వినొచ్చు. ఇంటర్నెట్‌ను కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కారులో ల్యాప్‌టాప్ పెట్టుకోవడానికి అల్యుమినియం ల్యాప్‌టాప్ స్టాండ్, ఫ్రిడ్జ్ వంటి అత్యాధునిక లగ్జరీ సదుపాయాలు కూడా ఉంటాయి.

Article Published On: Friday, February 11, 2011, 16:52 [IST]
English summary
Want to know about iPda Car, Please readt his article. London based luxary car maker Land Rover devloping a car which is having an iPad system inbuilt. Limited edition version of the Range Rover luxury 4WD has become world's first vehicle to be offered with iPads as standard.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+