భారత మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్: యమహా

Yamaha
యమహా బైక్స్‌కు భారత్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి యమహా కంపెనీ ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టే అంశంపై దృష్టి సారించింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్లో ప్రత్యమ్నాయ రవాణా వ్యవస్థపై ఈ జపాన్ ఆటో దిగ్గజం కన్నేసింది. జపాన్‌కు చెందిన యమహా మోటార్ కంపెనీ పూర్తి అనుబంధ సంస్థ అయిన ఇండియా యమహా మోటార్ కూడా భారత్‌కు సరిపోయే విధంగా ఓ స్కూటర్‌ను రూపొందిస్తుంది. త్వరలోనే ఇది భారత రోడ్లపై పరుగులు తీయనుంది. అంతేకాకుండా.. ఈ ఏడాది యమహా మరో రెండు కొత్త బైకులను కూడా విడుదల చేయనుంది.

పెరుగుతున్న ఇంధన ధరలను గమనిస్తే... ఎలక్ట్రిక్ బైకుల ఓ చక్కని ప్రత్యామ్నాయని, ప్రస్తుతం జపాన్, యూరప్ మార్కెట్లలో తమ ఎలక్ట్రిక్ బైకులను విక్రయిస్తున్నామని, ఈ ఉత్పత్తులను భారత మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉందని ఇండియా యమహా మోటార్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) జున్ నకటా తెలిపారు. అయితే.. వీటిని భారత్‌లో ఎప్పుడు విడుదల చేసేది, మరియు వాటి సాంకేతిక ప్రత్యేకతలు వంటి పూర్తి వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

కాగా.. భారత్‌లో యమహా స్కూటర్ విభాగం గురించి ప్రశ్నించగా.. నకటా సమాధానమిస్తూ.. స్కూటర్ మార్కెట్లోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తున్నామని, జపాన్‌లో ప్రస్తుతం భారత మార్కెట్‌కు అనుగుణంగా ఓ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టడానికి ఊహించిన సమయం కన్నా ఎక్కువ సమయమే పడుతుందని, ఎందుకంటే కంపెనీ భారత వినియోగదారులకు మెరుగైన సేవలు అందిచాలని భావిస్తుందని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Monday, March 7, 2011, 12:34 [IST]
English summary
Japanese auto giant Yamaha said it might consider launching an electric bike in the fast growing Indian two-wheeler market to offer an alternative mode transportation. The company's wholly-owned subsidiary, India Yamaha Motor, is also developing an India-specific scooter that will hit the roads in the "near future". Besides, it will launch two new bikes in the country in this year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+