ఎఫ్‌జడ్ సిరీస్‌లో ఇప్పటికే పలు విజయవంతమైన బైక్‌లను అందించామని, ఈ సిరీస్‌లో కొత్తగా స్ట్రీక్ పేరిట మరింత ఆధునిక బైక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని యమహా మోటార్ వెల్లడించింది. గోల్డ్, వైట్, సైబర్ గ్రీన్, పసుపు రంగుల్లో లభ్యమవుతున్న ఎఫ్‌జడ్ సిరీస్ బైక్‌లు ఇకపై బ్లాక్, లావా రెడ్ రంగుల్లోనూ లభిస్తాయని సంస్థ సిఇఒ హిరోయుకి సుజుకి వివరించారు. 153 సిసి సామర్థ్యంతో ట్రిపుల్ మాచో కాన్సెప్ట్‌తో తయారైన ఎఫ్‌జడ్ సిరీస్ బైక్‌లు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి 67 నుంచి 74 వేల రూపాయల (ఎక్స్-షోరోం, న్యూఢిల్లిd) మధ్య లభ్యమవుతాయని తెలిపారు. కాగా, ఎఫ్‌జడ్-ఎస్ స్ట్రీక్‌ను బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం ఆవిష్కరించారు.