ఈ ఏడాది 5,00,000 బైక్‌లను విక్రయిస్తాం: యమహా ఇండియా

ప్రిమీయం, డీలక్స్, బేసిక్, ఎగ్జిక్యూటివ్ మరియు స్టాండర్డ్ వంటి ఐదు బైక్ విభాగాల్లోని ఉత్పత్తులను తమ కంపెనీ అందిస్తోందని, ప్రస్తుతం 14 శాతం మార్కెట్ వాటా ఉన్న డీలక్స్ బైక్ సెగ్మెంట్‌పైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించామని ఆయన తెలిపారు. భారత మార్కెట్లో 13 మోడళ్లను అందిస్తున్న యమహా అన్ని విభాగాలను కలిపి రెండు శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. యమహాకు భారత్‌లో యూపి, హర్యానాలలో రెండు ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కంపెనీ 10 మిలియన్ డాలర్ల నిధులను పెట్టుబడిగా వెచ్చించనుంది. అంతేకాకుండా తమ విక్రయాలను కూడా రెండింతలకు పెంచుకునేందుకు వచ్చే ఏడాది దేశీయ మార్కెట్లో తమ స్కూటర్లను ప్రవేశపెట్టడానికి కంపెనీ సన్నాహాలు చేస్తుంది.


Click it and Unblock the Notifications








