ఎఫ్‌జెడ్ బైక్‌లపై పెరుగుతున్న క్రేజ్..: భారీ వృద్ధి బాటలో యమహా

Yamaha FZ-S
జపాన్ టూ-వీలర్ కంపెనీ యమహా మోటార్స్ భారత మార్కెట్లో అందిస్తున్న ఎఫ్‌జెడ్ సిరీస్ బైకుల పట్ల యువత యమ క్రేజ్ చూపుతోంది. అప్‌గ్రేడ్ చేసిన ఎఫ్‌జెడ్, ఎఫ్‌జెడ్-ఎస్ మరియు ఫేజర్ మోడళ్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది. ఫలితంగా యమహా విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఓవైపు మార్కెట్లో ఇతర కంపెనీలు డీలా పడుతుంటే.. యమహా మాత్రం భారీ వృద్ధిని నమోదు చేసుకుంటుంది. గడచిన నెలలో యమహా దేశీయ విక్రయాలు 59 శాతం పెరిగాయంటేనే ఈ బ్రాండ్ పట్ల భారత వినియోగాదారులు చూపిస్తున్న ఆదరణ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. మే 2011లో ఇండియా యమహా మోటార్ దేశీయ విక్రయాలు 58.7 శాతం వృద్ధి చెంది గతేడాది కన్నా 10,345 యూనిట్లను అధికంగా అమ్ముడయ్యాయి.

మే 2010లో ఇండియా యమహా మోటార్ దేశీయ మార్కెట్లో 17,614 ద్విచక్ర వాహనాలను విక్రయిస్తే.. మే 2011లో 27,959 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఈ సమయంలో కంపెనీ మొత్తం విక్రయాలను (ఎగుమతులను కూడా కలిపి) పరిశీలిస్తే.. అవి 55 శాతం వృద్ధి చెంది 25,033 యూనిట్ల నుంచి 38,812 యూనిట్లకు పెరిగాయి. అలాగే, కేవలం ఎగుమతులను మాత్రమే గమనించినట్లయితే అవి 46.28 శాతం వృద్ధిని సాధించి 7,419 యూనిట్ల నుంచి 10,853 యూనిట్లకు పెరిగాయి. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఎఫ్‌జెడ్, ఎస్‌జెడ్ సిరీస్ బైక్‌ల వల్లే ఇంత వృద్ధిని సాధించగలిగామని, వీటికి మార్కెట్ నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఇండియా యమాహా మోటార్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హిరోయుకి సుజుకి తెలిపారు.

More from DriveSpark

Article Published On: Friday, June 3, 2011, 14:23 [IST]
English summary
Japanese two-wheeler manufacturer Yamaha Motor's Indian subsidiary India Yamaha Motor reported a 59% growth in domestic sales for the month of May 2011. "India Yamaha Motor has registered a growth of 58.7 percent in its domestic market for May 2011, with a sale of 27,959 units as compared to 17,614 units sold last year," the company said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+