రెండేళ్ల పది లక్షల యూనిట్లను విక్రయిస్తాం: ఇండియా యమహా

స్కూటర్ విడుదలతో తమ విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉమదని కంపెనీ అంచనా చేస్తోంది. ప్రిమీయం, డీలక్స్ సెగ్మెంట్లలో కంపెనీ బాగా రాణిస్తుందున్న భవిష్యత్తులో మరిన్ని టాటా-ఎండ్ ఉత్పత్తలను విడుదలచేస్తామని, ఈ ఏడాది చివరి నాటికి ఈ సెగ్మెంట్లో 20 శాతం మార్కెట్ వాటాను సాధించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఇలాంటి ఉత్పత్తులకు బి మరియు సి క్యాటగిరీ పట్టణాలు మరియు రూరల్ మార్కెట్ల నుండి కంపెనీ భారీ డిమాండును దక్కించుకుంటోంది. అలాగే, 2013 నాటికి 10 లక్షల వాహనాల టార్గెట్‌ను చేరుకోవాలని యమహా నిర్ణయించింది.
గడచిన రెండు నెలల్లో డీలక్స్ సెగ్మెంట్లో కంపెనీ 14 శాతం మార్కెట్ వాటాను ఆర్జించగలిగింది. ఇండియా యమహా మోటార్స్ కంపెనీకు ఉత్తరప్రదేశ్‌లోని సూరజ్‌పూర్, హర్యానాలోని ఫరీదాబాద్‌లలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. సూరజ్‌పూర్ ప్లాంటు ఏటా 6,00,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది, రానున్న కాలంలో దీన్ని 10 లక్షల యూనిట్లకు పెంచవచ్చని అంచనా. ఇక ఫరీబాద్ ప్లాంట్ ఇంజన్ మరియు ఇతర విడిభాగాలను తయారు చేస్తుంది.


Click it and Unblock the Notifications








