జూన్ నెలలో 30 శాతం పెరిగిన యమహా మోటార్స్ విక్రయాలు

ఇదే సమయంలో కంపెనీ ఎగుమతులు కూడా 33.35 శాతం వృద్ధిని సాధించి 6,998 యూనిట్ల నుంచి 9,332 యూనిట్లకు పెరిగాయి. ఈ సందర్భంగా ఇండియా యమహా మోటార్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) జున్ నకటా ప్రస్తుత సంవత్సరంలో స్థిరమైన విక్రయాల వృద్ధిని చూసి సంతోషంగా ఉన్నామని కొత్తగా విడుదల చేసిన ఎఫ్‌జెడ్ సిరీస్ బైక్‌ల వల్ల ఇటు దేశీయ అటు విదేశీయ మార్కెట్లలో విక్రయాలు జోరందుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం కంపెనీ టైర్-2, టైర్-3 నగరాలకు చేరుకునేందుకు సేల్స్ మరియు సర్వీస్ నెట్‌వర్క్‌లను విస్తరిస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications