గ్రామీణ మార్కెట్ల కోసం యమహా చవక బైక్‌లు!

Yamaha Crux
జపాన్ ద్విచక్ర వాహన దిగ్గజం యమహా ఇప్పుడు గ్రామీణ మార్కెట్లపై కన్నేసింది. ప్రస్తుతం పట్టణ మార్కెట్లలో స్పోర్ట్స్ బైక్స్, హై-ఎండ్ మోటార్‌సైకిళ్లతో దూసుకుపోతున్న యమహా, గ్రామీణ మార్కెట్లలో సైతం తన సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతోంది. దేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇప్పటికే గ్రామీణ మార్కెట్ల కోసం బాక్సర్ బైక్‌ను అప్‌గ్రేడ్ చేసి పునఃప్రవేశపెట్టిన నేపథ్యంలో యమహా కూడా గ్రామీణ మార్కెట్ల వైపు దృష్టి సారించడం గమానర్హం.

ఈ నేపథ్యంలో యమహా కూడా గ్రామీణ మార్కెట్ల కోసం తక్కువ ధర కలిగిన మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రీమియం బైక్-మేకర్‌గా తమకున్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా అర్బన్ మార్కెట్లలో మంచి విక్రయాలను కళ్లజూస్తున్నామని, ఇకపై గ్రామీణ మార్కెట్లలోనూ తమ స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తామని ఇండియా యమహా మోటార్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

గడచిన సంవత్సరం (2010)లో యమహా 3.8 లక్షల మోటార్‌సైకిళ్లను విక్రయించింది. కాగా.. ఈ ఏడాది ఈ సంఖ్యను 5.2 లక్షలకు పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎఫ్‌జెడ్, ఫేజర్, ఆర్15, క్రక్స్, వైబిఆర్, ఎస్‌జెడ్ సిరీస్ మోటార్‌సైకిళ్లను యమహా విక్రయిస్తోంది. గ్రామీణ మార్కెట్ల నుండి అమ్మకాలు నెమ్మదిగా వృద్ధి చెందుతుండటంతో దాదాపు అన్ని కంపెనీలు ఆ మార్కెట్ల వైపు అడుగులు వేస్తున్నాయి.

యమహా అమ్మకాలలో దాదాపు 40 శాతం అమ్మకాలు గ్రామీణ మార్కెట్ల నుండే వస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని షోరూమ్‌లను, తక్కువ ధర కలిగిన మోడళ్లను అందించాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం తమకు దేశవ్యాప్తంగా 400 డీలర్లు ఉన్నారని, త్వరలోనే వీటి సంఖ్యను పెంచుకోనున్నామని, రూరల్ మార్కెట్ కోసం యమహా క్రక్స్, వైబిఆర్ 110లు ప్రధానమైన ఉత్పత్తులని ఆయన చెప్పారు. ఇవికాకుండా భారత మార్కెట్ కోసం యమహా ఓ స్కూటర్‌ను కూడా అభివృద్ధి చేస్తున్న విషయం విదితమే.

More from DriveSpark

Article Published On: Tuesday, September 20, 2011, 13:07 [IST]
English summary
Yamaha, the Japanese two wheeler manufacturer is now looking the rural markets in India to boost sales after gaining a foothold in the urban market. The company is planning to launch more models that are affordable in the near future.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+