2012లో భారత మార్కెట్లో స్కూటర్‌ను ప్రవేశపెట్టనున్న యమహా

భారత్‌లో స్కూటర్ మార్కెట్ చాలా విశాలమైనదని, ఇక్కడ పటిష్టమైన స్థానాన్ని తాము కోరుకుంటున్నామని, దేశీయ మార్కెట్లో 2012 నాటికి ఓ స్కూటర్‌ను విడుదల చేసేందుకు ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నామని ఇండియా యమహా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ హిరోయుకి సుజుకి వెల్లడించారు. అయితే ఎటువంటి స్కూటర్‌ను విడుదల చేయనున్నారనే విషయాన్ని వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరిస్తూ... యమహా మోటార్‌సైకిళ్ల మాదిరిగానే స్టైలిష్ అండ్ స్మార్ట్ డిజైన్‌లను కలిగి ఉండేలా వీటిపై శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు.
2010లో భారత స్కూటర్ మార్కెట్ 50.54 శాతం వృద్ధిం చెంది 19.6 లక్షల స్కూటర్లు అమ్ముడయ్యాయి. కాగా.. స్కూటర్ల విక్రయాలలో అత్యధిక స్కూటర్లను విక్రయించిన కంపెనీగా హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా అగ్రస్థానంలో ఉండగా.. టీవీఎస్ మోటార్ కంపెనీ, హీరో హోండా వంటి ఇతర కంపెనీలు కూడా ఈ విభాగంలో ప్రోత్సాహకర వృద్ధిని కనబరిచాయి. గత నెలలో ఇండియా యమాహా మోటార్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) జున్ నకటా కూడా భారత్‌కు అనుగుణంగా జపాన్‌లో ఓ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








