భారత్‌లో 2012 నాటికి స్కూటర్లను ప్రవేశపెట్టనున్న యమహా

కంపెనీకు చెందిన మరో అధికారి మాట్లాడుతూ... 2012 నాటికి ఈ స్కూటర్ల విడుదలను అంచనా వేయవచ్చునని చెప్పారు. సూరజ్‌పూర్ మరియు ఫరీదాబాద్ వద్ద యమాహా ఉత్పత్తి కేంద్రాలలో ఈ స్కూటర్లను తయారుచేసే అవకాశం ఉంది. 2012 నాటికి కంపెనీ స్కూటర్ల సామర్థ్యాన్ని 10 లక్షలకు పెంచుకునేందుకు గానూ కంపెనీ 10 మిలియన్ డాలర్ల పెట్టుబడులను వెచ్చించిందని ఇండియా యమహా సీఈఓ మరియు ఎండి హిరోయుకి సుజుకి వెల్లడించారు. దీంతో కంపెనీ మొత్తం ద్విచక్ర వాహన ఉత్పత్తి సామర్థ్యం సాలీనా ఆరు లక్షల యూనిట్లను తాకనుంది. ప్రస్తుతం కంపెనీ ఉత్పత్తి ఏటా ఐదు లక్షల యూనిట్లు.


Click it and Unblock the Notifications