సరికొత్త 'ఆర్15 వెర్షన్ 2.0'ను విడుదల చేసిన యమహా
ప్రస్తుతం ఉన్నఆర్15కు అప్‌గ్రేడ్ వెర్షన్ అని తెలిసే విధంగా దీని పేరులో అధనంగా 'వెర్షన్ 2.0'ను కంపెనీ జోడించింది. ఆర్15 బాడీ డిజైన్‌లో కూడా ఈ మార్పును మనం గుర్తించవచ్చు. వినియోగదారుల అభిప్రాయ సేకరణ ఆధారంగా ఈ కొత్త మోటార్‌సైకిల్‌ను కంపెనీ రూపొందించింది.
కొత్త ఆర్15కు మరింత అదనపు స్పోర్టీ లుక్ ఇచ్చేందుకు దీనికి స్లిట్ సీట్ (రెండుగా విడిపోయి ఉండే సీట్లు)ను అమర్చారు. బైక్ వెనుక టైరును కూడా కాస్తంత వెడల్పు చేయబడింది. వెనుకవైపు ఉండే టర్నింగ్ ఇండికేటర్లు మరియు నెంబర్ ప్లేట్‌ను పాత వేరియంట్ కన్నా కాస్తంత పైభాగంలో ఉండేలా అమర్చారు.
ఇకపోతే దీని సైలెన్సర్ డిజైన్‌ను కూడా మార్పు చేసి, ఫౌక్స్ కార్బన్ ఫైబర్ ఫినిష్‌తో ఆకర్షనీయంగా తీర్చిదిద్దారు. బైక్ వెనుకవైపు అమర్చిన ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ కొత్త ఆర్15లో మరో ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. టెన్ స్పోక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ కోటింగ్ ఇంజన్‌లు ఇందులో కొత్త అంశాలు.
యమహా ఆర్15 వెర్షన్ 2.0 ఇంజన్‌లోను మరియు ముందువైపు డిజైన్‌లో మార్పులు లేవు. లిక్విడ్ కూల్ 4 వాల్వ్ 150 సీసీ ఇంజన్ గరిష్టంగా 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 17 బిహెచ్‌పిల శక్తిని, 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 15 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త మార్పుల కారణంగా దీని బరువు 136 కిలోలకు పెరిగింది.
ఇక భారత మార్కెట్లో కొత్త యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 ధర రూ. 1.07 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.


Click it and Unblock the Notifications









