స్కూటర్, ఎలక్ట్రిక్ బైక్‌లతో వృద్ధి రేటును పెంచుకోనున్న యమహా

Yamaha
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఇండియా యమహా మోటార్ 2011 సంవత్సరానికి గానూ భారీ విక్రయ లక్ష్యాన్ని నిర్దేశించింది. 2011లో కంపెనీ ఐదు లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొంది. వీటిలో 3.5 లక్షల వాహనాలను దేశీయ మార్కెట్లోను, 1.5 లక్షల వాహనాలను విదేశీ మార్కెట్లలోనూ విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా నిర్ణయించింది.

గత ఏడాది(2010)లో కంపెనీ మొత్తం 3.8 లక్షల వాహనాలను విక్రయించంగా.. అందులో 2.5 లక్షల వాహనాలను భారత్‌లోనూ, 1.3 లక్షల వాహనాలను విదేశాలలోనూ విక్రయించిందిం. ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వాహనాలకు భవిష్యత్తులో డిమాండు పెరుగుతుందనే ఉద్దేశంతో.. వేగంగా ఎదుగుతున్న భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు కంపెనీ పెర్కొంది.

కాగా.. ఈ ఏడాది మార్చి నెలలో ఇండియా యమహా మోటార్ కంపెనీ దేశీయ విక్రయాలు గతేడాదితో పోలిస్తే.. 44 శాతం వృద్ధి సాధించి, 17,864 యూనిట్ల నుంచి 25,784 యూనిట్లకు పెరిగాయి. అలాగే ఎగుమతులు కూడా మార్చి నెలలో 9,596 యూనిట్ల నుంచి 10,984 యూనిట్లకు పెరిగినట్లు కంపెనీ వివరించింది. యమహా తమ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత విస్తరించుకునేందుకు యమహా సేఫ్టీ రైడింగ్ సైన్స్ (వైఎస్‌ఆర్‌ఎస్), ఆర్15 వన్‌మేక్ రేస్ చాంపియన్‌షిప్, రైడింగ్ క్లినిక్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

కంపెనీ విక్రయాలు కనబరుస్తున్న వృద్ధిని గమనిస్తే.. ఇది తమ బ్రాండ్ పట్ల వినియోగదారులకు పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఇండియా యమహా మోటార్ సీఈవో, ఎండీ హిరోయుకి సుజుకి అన్నారు. యమహా అందిస్తున్న స్పోర్ట్స్ మోడల్ వైజడ్‌ఎఫ్-ఆర్ 15, ఎఫ్‌జడ్, ఎస్‌జడ్ సిరీస్ బైక్‌లకు మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. భారత్‌లో తమ విక్రయాలను మరింతగా పెంచుకునేందుకు భారత్‌కు అనుగుణంగా జపాన్‌లో ఓ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు గత నెలలో ఇండియా యమాహా మోటార్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) జున్ నకటా వెల్లడించిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Wednesday, April 6, 2011, 13:01 [IST]
English summary
Japanese two-wheeler major Yamaha eying to sell 5 lakh units in 2011, out of which 3.5 lakh units will be in the domestic market and 1.5 lakh units will be exports. Last year it sold a total of 3.8 lakh units, out of which 2.5 lakh units found buyers in the domestic market and 1.3 lakh units were exported.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+