రూ.1.16 లక్షలకే సిబిఆర్ 150ఆర్‌ను విడుదల చేసిన హోండా
ఇదివరకటి కథనంలో తెలుగు డ్రైవ్ స్పార్క్ హోండా సిబిఆర్ 150ఆర్ బుకింగ్స్ గురించి ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాకు అందిన తాజా సమాచారం ప్రకారం, సిబిఆర్ 150ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను వాణిజ్యపరంగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని హోండా ప్రకటింది. మరో రెండు వారాల్లోగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ హోండా డీలర్‌షిప్ కేంద్రాల్లో ఈ బైక్ లభ్యం కానుంది.
స్టాండర్డ్, డీలక్స్ అనే రెండు వేరియంట్లలో సిబిఆర్ 150ఆర్‌ను హోండా విడుదల చేసింది. స్టాండర్డ్ వేరియంట్ సిబిఆర్ 150ఆర్ ధర రూ.1,16,385 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా, డీలక్స్ వేరియంట్ సిబిఆర్ 150ఆర్ ధర రూ.1,17,385 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. దీని ఆన్-రోడ్ ధర రూ.1.39 లక్షల నుండి రూ.1.40 లక్షల రేంజ్‌లో ఉంది (ఆన్-రోడ్ ధర రాష్ట్రాన్ని బట్టి మారుతుంది).
మొదటి బ్యాచ్‌లో భాగంగా దాదాపు 750 హోండా సిబిఆర్ 150ఆర్ స్పోర్ట్స్ బైక్‌లను కంపెనీ విక్రయించనుంది. మార్చి నెలాఖరు నుండి ఈ బైక్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి. హోండా సిబిఆర్ 150ఆర్‌లో ఉపయోగించిన 150సీసీ లిక్విడ్ కూల్డ్, డిఓహెచ్‌సి పిజిఎమ్-ఎఫ్ఐ ఇంజన్ 10,500 ఆర్‌పిఎమ్ వద్ద 18 బిహెచ్‌పిల శక్తిని, 7500 ఆర్‌పిఎమ్ వద్ద 12.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.


Click it and Unblock the Notifications









