బడ్జెట్ ముందు ధరలకే కొత్త వాహనాలను కొనుక్కోవచ్చు

అయితే, మీరు తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే.. ప్రస్తుతం మీరు కొనుగోలు చేసే కారు లేదా బైక్‌ను బడ్జెట్‌కు ముందు ఎంత ధరైతే ఉందో అదే ధరకు పొందవచ్చు. అదెలా అనుకుంటున్నారా..? అయితే ఈ కథనం చదవండి.
మీరు మీ వాహనాన్ని బడ్జెట్‌కు ముందు బుక్ చేసుకున్నా లేదా డీలర్ పాత స్టాక్‌ను విక్రయిస్తున్నా అలాంటి వాహనాలను బడ్జెట్‌కు ముందు ఏ ధరైతే ఉందో అదే ధరను చెల్లించి కొనుగోలు చేయవచ్చు. కార్ మేకర్లు తెలిపిన దాని ప్రకారం, మార్చి 16వ తేదీ నుండి డీలర్‌షిప్‌లకు డిశ్పాచ్ అయిన వాహనాలకు మాత్రమే కొత్త రేట్లు వరిస్తాయి. కాబట్టి, పాత స్టాక్‌ను విక్రయించే డీలర్లు పాత ధరలకే వాహనాలను విక్రయించాల్సి ఉంటుంది.
డీలర్ల వద్ద పాత్ స్టాక్ పూర్తిగా క్లియర్ అయ్యే వరకూ కొత్త వాహనాలను కొనాలనుకునే వారు బడ్జెట్‌కు ముందు ధరకే పొందవచ్చు. కాదు కూడదని డీలర్ వాదించి కొత్త ధరకే పాత స్టాక్‌ను కొనుగోలుదారులకు అంటగట్టాలని చూస్తే, కొనుగోలుదారులు గట్టిగా డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి, కొత్త వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు అది పాత స్టాక్ అని తెలిసినట్లయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త ధరను చెల్లించకండి.


Click it and Unblock the Notifications








