మోన్‌స్టర్ డీజిల్ స్పోర్ట్స్ బైక్‌ను ఆవిష్కరించిన డ్యుకాటి
ఇటలీకు చెందిన ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీ కంపెనీ డ్యుకాటి అందిస్తున్న మోన్‌స్టర్ స్పోర్ట్స్ బైక్‌లో మరో సరికొత్త వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. "డ్యుకాటి మోన్‌స్టర్ డీజిల్" అనే పేరుతో ఓ సెలబ్రేషన్ ఎడిషన్‌ను డ్యుకాటి పరిచయం చేసింది. దీని పేరులో ఉన్నట్లు ఇది డీజిల్‌తో నడిచే డ్యుకాటి మోన్‌స్టర్ అనుకుంటే పొరపాటే. ఇది కూడా పెట్రోల్‌తోనే పనిచేస్తుంది.
మోటో జిపి ఛాంపియన్‌షిప్‌లో అప్పీరల్ బ్రాండ్ డీజిల్‌తో తమకున్న అసోషియేషన్‌లో భాగంగా డ్యుకాటి ఈ సెలబ్రేషన్ ఎడిషన్ వేరియంట్‌ను రూపొందించింది. అందుకే ఈ వేరియంట్‌కు మోన్‌స్టర్ డీజిల్ అనే పేరును ఖారురు చేసింది. రానున్న జులై నాటికి ఇది మార్కెట్లో లభ్యం కానుంది.
డ్యుకాటి మోన్‌స్టర్ డీజిల్‌లో 1078సీసీ ఎల్-ట్విన్ సిలిండర్, 2-వాల్వ్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది గరిష్టంగా 100 హెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్, యూరో 3 వెర్షన్‌తో ఇది రెండేళ్ల అపరిమిత మైలేజ్ వారంటీతో లభిస్తుంది. ఇందులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) ఓ స్టాండర్డ్ ఫీచర్‌గా లభిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ మోన్‌స్టర్ డీజిల్ కేవలం ఒకే రంగు (డీజిల్ బ్రేవ్ గ్రీన్ మ్యాట్)లో మాత్రేమ లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications









