ఏప్రిల్ 2 నుండి స్కొడా సమ్మర్ చెకప్ క్యాంప్ ప్రారంభం

మీరు స్కొడా వినియోగదారులా..? అయితే ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే. తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ వేసవిలో స్కొడా ఓ కాంప్లిమెంటరీ సమ్మర్ క్యాంప్‌ను నిర్వహిస్తోంది. రానున్న ఏప్రిల్ 2 నుండి ప్రారంభం కానున్న ఈ సమ్మర్ క్యాంప్ ఏప్రిల్ 30 వరకూ కొనసాగనుంది.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్కొడా అధీకృత డీలర్‌షిప్ కేంద్రాలు, సర్వీస్ సెంటర్లలో ఈ ఉచిత సర్వీసింగ్ క్యాంప్ అందుబాటులోకి రానుంది. ఈ క్యాంప్‌లో భాగంగా స్కొడా సర్వీస్ సెంటర్లకు తీసుకు వచ్చే స్కొడా వాహనాల్లో ఏసి, టైర్లు, బ్రేక్స్, ఇంజన్ వంటి 15-పాయింట్ ఫ్రీ చెకప్ చేయబడుతుంది.

ఈ చెకప్‌లో ఏవైనా లోపాలను గుర్తిస్తే వాటిని సరి చేయటం జరుగుతుంది. ఒకవేళ ఏవైనా విడిభాగాలు మార్చాల్సి వస్తే తగ్గింపు ధరకే ఒరిజనల్ స్పేర్ పార్ట్‌లను కూడా కంపెనీ అందిస్తుంది. సాధారణంగా వేసవిలో చాలా మంది దూర ప్రయాణాలు చేస్తుంటారు కాబట్టి, వాహనం కండిషన్‌లో ఉండటం ఎంతో ముఖ్యం.

ఈ సమ్మర్ క్యాంప్‌లో భాగంగా సుమారు 28,000 వాహనాలను తనిఖీ చేయవచ్చని స్కొడా అంచనా వేస్తోంది. గడచిన వర్షాకాల సమయంలో కూడా స్కొడా ఓ మాన్‌సూన్ క్యాంప్‌ను నిర్వహించింది. ప్రస్తుతం స్కొడా ఇండియాలో ఐదు మోడళ్లను విక్రయిస్తుంది. అవి ఫ్యాబియా, ర్యాపిడ్, లారా, యెటి, సూపర్బ్.

More from DriveSpark

Article Published On: Wednesday, March 21, 2012, 18:04 [IST]
English summary
The Volkswagen group owned Czech automaker Skoda is conducting a complementary Summer check up camp for its customers. The camp will begin from the 2nd of April till 30th across all Skoda authorised dealerships across the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+