హై హీల్స్ ధరించి డ్రైవ్ చేయటం వలన ఎక్కువగా ప్రమాదాలు!
అయినా సరే ఇవన్నీ పెడచెవిన పెట్టి మరీ మహిళలు హై హీల్స్ ధరించి ఆరోగ్యం పాడు చేసుకుంటుటారు. అక్కడి వరకూ అయితే, ఓకే హై హీల్స్ ధరిచంటం వల్ల వారి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవటమే కాకుండా, ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. అమ్మాయిలు హై హీల్స్ ధరిచంటం వల్ల ఇతరుల ప్రాణాలకు వచ్చిన నష్టం ఏంటా అనుకుంటున్నారా..? అయితే ఈ కథనం చదవండి.
మహిళలు హై హీల్స్ ధరించి డ్రైవింగ్ చేయటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన రోడ్ సేఫ్టీ ఛారిటీ సంస్థ 'బ్రేక్' ఎత్తు మడిమెలు, ప్లాట్‌ఫామ్ షూలను ధరించి డ్రైవ్ చేయకండని బహిరంగ అభ్యర్థనలు కూడా చేసింది. ఎత్తు మడిమెలు ఉండే పాదరక్షలను ధరించటం వలన బ్రేక్, యాక్సిలరేటర్, క్లచ్ పెడల్స్‌పై సరైన నియంత్రణ ఉండదు, ఫలితంగా అత్యవసర సమయాల్లో వాహనాలను నియంత్రించటం కష్టమవుతుంది.
ఓ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించి సర్వేలో దాదాపు 40 శాతం మంది మహిళలు హై హీల్స్ ధరించి డ్రైవ్ చేస్తారని వెల్లడించింది. 750 మంది మహిళలపై నిర్వహించిన ఈ సర్వేలో 75 మహిళలు తాము ధరించిన హై హీల్స్ కారణంగా ప్రమాదానికి గురయ్యామని ఒప్పుకున్నారు. తాము ధరించిన హై హీల్స్ పెడల్స్ పైనుండి జారిపోయి పెడల్స్ మధ్యలో ఇరుక్కుపోవటం వలన ప్రమాదం జరిగినట్లు వారు వివరించారు. కాబట్టి అమ్మాయిలు.. హీ హీల్స్ వేసుకుని డ్రైవ్ చేసేటప్పుడు జర భద్రం..!!


Click it and Unblock the Notifications









