ముంబైలో మారుతి సుజుకి 24 గంటల సర్వీస్ సెంటర్

తన కస్టమర్లకు ఎలాంటి అంతరాయం లేకుండా, ఏ సమయంలో అయినా సరే సర్వీసింగ్ సేవలు అందించేందుకు గానూ ముంబైలోని ఓ మారుతి సుజుకి కార్ డీలర్, నగరంలో ఓ 24 గంటల సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేశాడు. దేశపు వాణిజ్య నగరంగా చెప్పుకునే ముంబైలోని ప్రధాన నగరంలో అంధేరీలోని మారుతి సుజుకి డీలర్ ఫోర్ట్‌పాయింట్ ఆటోమోటివ్ ఈ 24 గంటల సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించింది.
దేశంలోనే ఇది మొట్టమొదటి మారుతి సుజుకి 24/7 సర్వీసింగ్ సెంటర్ కావటం విశేషం. ఈ సర్వీస్ సెంటర్లో రాత్రి వేళల్లో సుమారు 40 నుండి 50 వాహనాలకు సర్వీసింగ్ చేయగల సామర్థ్యం ఉంది. రాత్రివేళ అత్యవసర పరిస్థితుల్లో సర్వీసింగ్ చేయాల్సివచ్చినప్పుడు, అలాగే పగటి వేళల్లో వెహికల్‌ను సర్వీసింగ్ చేయించడానికి సమయం లేని వారి కోసం ఎలాంటి అధనపు చార్జీలు వసూలు చేయకుండానే ఈ సేవలను అందిస్తున్నామని ఫోర్ట్‌పాయింట్ ఆటోమోటివ్ (కార్స్) మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. ఇలాంటి సర్వీస్ సెంటర్లు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తే ఎంత బావుంటుందో కదా.


Click it and Unblock the Notifications








