ఆఫ్రికా మార్కెట్లపై కన్నేసిన హీరో మోటోకార్ప్

Hero MotoCorp
ప్రపంచపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) ఆఫ్రికా మార్కెట్లపై కన్నేసింది. ఆఫ్రికాలో తయారీ, అసెంబ్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అక్కడ వృద్ధి చెందుతున్న మార్కెట్లను గుర్తించామని కంపెనీ పేర్కొంది. కొన్ని దేశాలలో అధిక వృద్ధి కలిగిన మార్కెట్లను తాము గుర్తించామని, కొన్నిచోట్ల అసెంబ్లింగ్ ప్లాంట్లను, మరికొన్ని చోట్ల తయారీ ప్లాంట్లను, ఇంకొన్ని చోట్ల ఎగుమతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని హీరో కార్పోరేట్ సర్వీసెస్ ఛైర్మన్ సునీల్ కాంత్ ముంజాల్ తెలిపారు.

ద్విచక్ర వాహన మార్కెట్‌లకు గల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఆఫ్రికా ఖండానికి తమ బృందాన్ని పంపించామని ముంజాల్ తెలిపారు. అక్కడి ద్విచక్ర వాహన విభాగంలో ప్రవేశించి వ్యాపారం చేయటానికి తమకు విశిష్టమైన అవకాశాలు ఉన్నాయని, ఈ సెగ్మెంట్లో ఇప్పటికే అనేక ఆఫ్రికా దేశాలు మంచి వృద్ధిని కనబరచాయని, తమ బృందాలు ఆఫ్రికాలోని దాదాపు అన్ని దేశాలను సందర్శించి అధ్యయనం చేయనున్నారని ఆయన చెప్పారు.

ఈ మార్కెట్లలో ఇప్పటికే అనేక విదేశీ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పటికీ, తమ కంపెనీ నిర్వాహక సామర్థ్యం, ఉత్పత్తి సామర్థ్యాలు తమకు అనుకూలంగా పనిచేస్తాయని ముంజాల్ తెలిపారు. ఇప్పటికే తమ భారతీయ స్నేహితులు (పోటీదారులు) అక్కడి మార్కెట్లకు వెళ్లారని, చైనీస్, థాయ్, జపనీస్ కంపెనీలు ఆఫ్రికా మార్కెట్లలో కార్యకలపాలు కొనసాగిస్తున్నాయని ఆయన చెప్పారు. తమ పనితీరు, ఉత్పత్తి పరిమాణాలతో ఈ మార్కెట్లో నిలదొక్కుకోగలమని ముంజాల్ ధీమా వ్యక్తం చేశారు.

More from DriveSpark

Article Published On: Monday, March 26, 2012, 15:22 [IST]
English summary
Indian two wheeler manufacturer Hero MotoCorp has set its eyes on Africa. The company has identified a large market for its products and is now scouting for right locations to set up its manufacturing plants.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+