ఇండియన్ డ్రైవర్ల కోసం ప్రత్యేక హారన్ల తయారీ: ఆడి

ఇండియన్ కార్లలో ఉపయోగించే హారన్లలో సత్తా లేదంటోంది జర్మనీ లగ్జరీ కార్ కంపెనీ ఆడి. రద్దీ ఎక్కువగా ఉండే ఇండియన్ రోడ్లపై సాధారణ హారన్ల పనితీరు సరిగ్గా ఉండటంలేదని, అందుకే తమ కార్ల సరికొత్త హారన్లను ఉపయోగించనున్నామని ఆడి పేర్కొంది. సాధారణంగా ఇండియన్ రోడ్లపై భారతీయ డ్రైవర్లు హారన్ ఉపయోగించే విధానాన్ని మనం ప్రతిరోజూ గమనిస్తూనే ఉంటాం.

అవసరం లేకపోయినా చెవులు చిల్లులు పడేలా పోమ్.. పోమ్.. అంటూ హారన్‌ను మ్రోగించటం మనకే చెల్లుతుందని చెప్పవచ్చు. విదేశీ రోడ్లపై అక్కడి డ్రైవర్లు హారన్ తక్కువగా మ్రోగిస్తారు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా హారన్లను తయారు చేస్తారు. విదేశీ కార్లలో ఉపయోగించే హారన్లను మనదేశపు కార్లలో ఉపయోగిస్తే, మనం నొక్కే నొక్కుడుకి అవి కొద్ది రోజులకే పాడైపోతాయి.

ఈ విషయం గురించి ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ ప్రస్తావిస్తూ.. ఇండియా కోసం ప్రత్యేకమైన హారన్ల అవసరం ఉంది. ఉదాహరణకు యూరప్‌లో ఉపయోగించే హారన్లను ఇండియాలో ఉపయోగిస్తే అవి కేవలం ఒకటి రెండు వారాల్లోనే చెడిపోతాయి. ముంబైలో ఒక్కరోజు మ్రోగించే హారన్ శబ్ధం, జర్మనీలో సంవత్సరం పాటు మ్రోగించే హారన్ శబ్ధంతో సమానమని ఆయన వివరించారు.

అందుకే ఇండియన్ మార్కెట్ కోసం మరింత శక్తివంతమైన, సమర్థవంతమైన హారన్లను అభివృద్ధి చేస్తున్నామని, ఈ హారన్‌ను రెండు వారాల పాటు నిరంతరం మ్రోగిస్తూ విభిన్న పద్ధతుల్లో పరీక్షించామని ఆయన తెలిపారు. ఇవి తమ కార్లు మరింత భద్రతను కల్పిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 27, 2012, 18:35 [IST]
English summary
Audi India director Michael Perschke revealed that special horns are being made for its Indian cars as local drivers honk too much to move through the hectic traffic. Most of the roads in India are poor and driving is a very tiring activity due to crowded roads.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+