తమిళనాడులో యమహా మూడో ప్లాంటు ఏర్పాటు!
యమహా భారత్‌లో తమ మూడవ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు గానూ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో స్థలాలు, మార్కెట్ పరిస్థితుల గురించి పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ మూడో ప్లాంటు ఏర్పాటు తమిళనాడు అన్నివిధాల (ముఖ్యంగా ఎగుమతులకు) అనువని యమహా భావించినట్లుంది. తమిళనాడులో యమహా ఇప్పటి స్థలాన్ని కూడా గుర్తించినట్లు సమాచారం.
వచ్చే నెల లేదా మే నెలలో తమిళనాడు సర్కారుతో యమహా ఓ పరస్పర సహకార ఒప్పందాన్ని కుదుర్చుకునే ఆస్కారం ఉంది. భారత మార్కెట్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటుగా త్వరలో స్కూటర్లను కూడా మార్కెట్లో విడుదల చేయనున్న నేపథ్యంలో డిమాండుకు అనుగుణంగా ఉత్పత్తులను అందించేందుకు సిద్ధంగా ఉండేందుకు గానూ యమహా మూడో ప్లాంటును ఏర్పాటు చేయనుంది.
గడచిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో యమహా ఆవిష్కరించిన చేసిన 'యమహా రే' స్కూటర్ ఈ దీపావళి నాటికి భారత మార్కెట్లో వాణిజ్యపరంగా విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications









