లేజర్ హెడ్‌లైట్లను అభివృద్ధి చేసిన బిఎమ్‌డబ్ల్యూ

ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం విషయానికి వస్తే, కార్లలో ఉపయోగించే టర్న్ ఇండికేటర్లు, బ్రేక్ లైట్లు, పార్కింగ్ లైట్లు, డేటైమ్ రన్నింగ్ ఎల్ఈడి లైట్లు గానూ చివరకు హెడ్‌లైట్లలో కూడా ఎల్ఈడి లైట్లను ఉపయోగించడం జరుగుతుంది. అయితే, తాజాగా బిఎమ్‌డబ్ల్యూ మరొకడుగు ముందుకు వేసి అత్యంత శక్తివంతమైన లేజర్ లైట్లను తమ కార్లలో హెడ్‌లైట్‌గా ఉపయోగించేందుకు సన్నాహాలు చేస్తుంది.
For More Images Of BMW Laser Headlights Click Here:
బిఎమ్‌డబ్ల్యూ ఇప్పటికే లేజర్ హెడ్‌లైట్లను తమ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో అభివృద్ధి చేసింది. ఈ లేజర్ లైట్ సాధారణంగా బ్లూ కలర్ కాంతిని వెలువరిస్తుంది. అయితే హెడ్‌లైట్లో ఉండే ఫాస్పర్ పదార్థం కారణంగా ఇది స్వచ్ఛమైన తెలుపు రంగు కాంతిలోకి మారిపోతుంది. ఫలితంగా ఈ లేజర్ మనుషలు, జంతువుల శరీరంపై కానీ, కంటిపై కానీ ఎలాంటి దష్ప్రభావాలను చూపించదని కంపెనీ పేర్కొంది.
ఈ లేజర్ హెడ్‌లైట్లు ఎల్ఈడి హెడ్‌లైట్ల కన్నా అత్యంత శక్తివంతమైనవి, సురక్షితమైనవే కాకుండా, విద్యుత్‌ను చాలా తక్కువ మొత్తంలో ఖర్చు చేస్తాయి. బిఎమ్‌డబ్ల్యూ ఆవిష్కరించిన ఐ8 కాన్సెప్ట్ కారులో తొలిసారిగా ఈ లేజర్ హెడ్‌లైట్లను ఉపయోగించనున్నారు. భవిష్యత్తులో మరిన్ని మోడళ్లలో ఈ లేజర్ హెడ్‌లైట్ టెక్నాలజీని ఉపయోగించనున్నామని బిఎమ్‌డబ్ల్యూ తెలిపింది.


Click it and Unblock the Notifications








