ఉత్పత్తుల ధరలు పెంచిన టీవీఎస్ మోటార్ కంపెనీ
బడ్జెట్ విడుదలైన తర్వాత ఇప్పటి వరకూ దాదాపు అన్ని ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు తాజాగా చెన్నైకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ కంపెనీ కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది.
ఎక్సైజ్ డ్యూటీలో పెరుగుదల లేదా తగ్గుదల ఉంటే దానికి వినియోగదారులపైకి బదిలీ చేయటం కంపెనీ పాలసీ అని, దీనికి అనుగుణంగా తాజా పెరుగుదలను కస్టమర్లపై మోపుతున్నామని టీవీఎస్ మోటార్ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ఏయే మోడళ్ల ధరలను ఎంత మేర పెంచనున్నామనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2012-13లో ఎక్సైజ్ సుంఖాన్ని 10 శాతం నుండి 12 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు ప్రభుత్వానికి అధిక సుంఖాలను చెల్లించాల్సి రావడంతో సదరు అదనపు భారాన్ని వినియోగదారులపై మోపుతున్నారు.


Click it and Unblock the Notifications









