ఇండియాకు వచ్చిన జాబ్రా డ్రైవ్ ఇన్-కార్ స్పీకర్ ఫోన్

కారులో ప్రయాణిస్తున్న ఫోనులో మాట్లాడటం ప్రమాదకరం. కానీ అత్యవసరమైన కాల్స్ వచ్చినప్పుడు సమాధానం ఇవ్వటం తప్పనిసరి. అలాగని ఇలాంటి అత్యవసర ఫోన్ కాల్స్‌ను డ్రైవ్ చేస్తూ ఆన్సర్ చేయలేం. మరి ఇందుకు పరిష్కారం ఏంటి అంటే.. జబ్రా డ్రైవ్ ఇన్-కార్ స్పీకర్‌ ఫోన్.

ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికాల తయారీ కంపెనీ జాబ్రా డ్రైవ్ అందిస్తున్న ఈ ఇన్-కార్ స్పీకర్ ఫోన్ బ్లూటూత్ ఆధారంగా పనిచేస్తుంది. మీ మొబైల్ ఫోన్‌లోని బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా ఈ స్పీకర్‌ను కనెక్ట్ చేసుకొని కారులోని సన్‌విజర్‌కు కానీ లేదా స్టీరింగ్‌కు దీనిని క్లిప్ (తగిలించడం) చేయడం ద్వారా సెల్‌ఫోన్‌ను చేతులతో ఆపరేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ స్పీకర్ సాయంతో అవతలి వారితో మాట్లాడవచ్చు.

Jabra Drive In-car Speaker Phone

జాబ్రా డ్రైవ్ ఇన్-కార్ స్పీకర్ ఫోన్ విశిష్టతలు:
* స్పష్టమైన సౌండ్, వాయిస్
* వాల్యూమ్ ప్లస్, మైనస్ బటన్‌ల సాయంతో శబ్ధాన్ని పెంచుకోవటం, తగ్గించటం చేయవచ్చు
* మ్యూజిక్, పాడ్‌కాస్ట్, జిపిఎస్ డైరెక్షన్లను వినొచ్చు
* బ్యాటరీ లెవల్, కెనక్షన్ స్టేటస్‌ల గురించి వాయిస్ గైడెన్స్
* మల్టీ‌యూజ్ - ఒకేసారి రెండు ఫోన్లను ఈ డివైజ్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు
* ఇందులో ఉన్న బ్యాటరీ 20 గంటల టాక్‌టైమ్‌, 30 రోజుల స్టాండ్‌బై వరకూ నిల్వ ఉంటుంది

భారత్‌లో జాబ్రా డ్రైవ్ ఇన్-కార్ స్పీకర్ ఫోన్ ధరలు రూ.3,999 నుండి ప్రారంభమవుతాయి. అమెజాన్, స్టాపల్స్ మొదలైన ఆన్-లైన్ వెబ్‌సైట్ల ద్వారా కూడా ఈ ఉత్పత్తిని కొనుగోలు చేయవచ్చు. ఏదేమైనప్పటికీ.. డ్రైవ్ చేస్తూ అవతలి వ్యక్తులతో మాట్లాడటం ప్రమాదకరం. ఇలా డ్రైవ్ చేస్తూ ఫోన్లో మాట్లాడటం వలన మీరు పరధ్యానానికి గురయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంత వరకూ డ్రైవ్ చేస్తున్న ఎలాంటి పరికరాలతోనైనా సరే ఫోన్లో మాట్లాడటం చేయకండి.

More from DriveSpark

Article Published On: Thursday, April 19, 2012, 16:28 [IST]
English summary
Jabra Drive introduces in-car speaker phone in the country. Jabra DRIVE is brilliantly simple. No setup is required, and it’s so easy to operate, you probably won’t even have to look in the manual to find out how to use it. Voice guidance talks you through as you pair it up with your mobile for the first time. After that, you just clip Jabra DRIVE onto your sun visor. The product will connect automatically with your phone as soon as you turn it on.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+