సుజుకి బ్రాండ్ అంబాసిడర్‌గా దబాంగ్ హీరో సల్మాన్ ఖాన్

బాలీవుడ్ సూపర్‌స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ త్వరలో మార్కెట్లోకి రానున్న సుజుకి బడ్జెట్ బైక్ హయాటేతో దబాంగ్ చేయనున్నాడు. సల్మాన్ ఖాన్‌ను తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్నామని జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్స్ పేర్కొంది. ఈ డీల్‌లో భాగంగా హయాటే మోటార్‌సైకిల్‌తో సల్మాన్ ఖాన్‌పై డిజైన్ చేసిన తొలి క్యాంపైన్ త్వరలోనే ప్రారంభంనుంది.

మాస్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని చవక ధరకే ఓ మంచి స్టయిలిష్ మోటార్‌సైకిల్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో హయాటే 110సీసీ బైక్‌ను సుజుకి మోటార్‌సైకిల్స్ అభివృద్ధి చేసింది. గడచిన జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో సుజుకి తమ బడ్జెట్ బైక్‌ను ఆవిష్కరించింది.

సుజుకి హయాటే‌లో 112.8సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ బైక్‌కు సంబంధించిన మరిన్న వివరాలు మా తెలుగు డ్రైవ్ స్పార్క్ పాఠకుల కోసం..:

సుజుకి హయాటే 110సీసీ ఫీచర్లు:
* ఇంజన్: 112.8సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎస్ఓహెచ్‌సి
* కిక్ స్టార్ట్/ఎలక్ట్రిక్ స్టార్ట్
* ఎయిర్ క్లియరెన్స్ నాన్-ఒవెన్ ఫ్యాబ్రిక్ ఎలిమెంట్
* లూబ్రికేషన్ సిస్టమ్ వెట్ సంప్
* క్లచ్: వెట్ మల్టీ-ప్లేట్ టైప్
* 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్
* ఫ్రంట్ సస్పెన్షన్: టెలిస్కోపిక్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్
* రియర్ సస్పెన్షన్: స్వింగ్-ఆర్మ్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్
* ఫ్రంట్ టైర్: 2.75 ఇంచ్‌లు
* రియర్ టైర్: 3 ఇంచ్‌లు
* ఫ్రంట్ బ్రేక్: డ్రమ్
* రియర్ బ్రేక్: డ్రమ్
* సిడిఐ ఇగ్నిషన్ టైప్
* ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం: 12.0 లీటర్లు
* బరువు: 115 కేజీలు
* మైలేజ్: ప్రతి లీటరు పెట్రోల్‌కు సమారు 60 కి.మీ.

సుజుకి నుండి మార్కెట్లోకి రాబోతున్న ఈ బడ్జెట్ బైక్ ధర దాదాపు రూ.48,000 నుండి రూ. 50,000 మధ్యలో ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Thursday, April 19, 2012, 15:57 [IST]
English summary
Suzuki Motorcycles India has named Bollywood Star Salman Khan as the brand ambassador of its soon to be launched 110cc Motorcycle Hayate.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+