టొయోటా కస్టమర్ల కోసం సమ్మర్ హాలిడే క్యాంప్
జపాన్ ఆటో దిగ్గజం టొయోటా తమ కస్టమర్ల కోసం సమ్మర్ హాలిడే క్యాంప్‌ను ప్రారంభించింది. ఈ క్యాంప్‌లో భాంగగా, వివిధ సర్వీసులను టొయోటా ఆఫర్ చేస్తుంది. టొయోటా కస్టమర్లు తమ కార్లకు ఈ క్యాంపులో ఉచిత చెకప్‌లను చేయించుకోవచ్చు. అంతేకాకుండా, వినియోగదారులు తగ్గింపు ధరలకే విడిభాగాలను కూడా కొనుగోలు చేసే వెసలుబాటును కూడా టొయోటా కల్పిస్తోంది.
టొయోటా సమ్మర్ హాలిడే క్యాంప్ ఈనెల 16వ తేదీన ప్రారంభమైంది. దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతదేశంలో ఈ క్యాంప్ మే 15, 2012న ముగుస్తుంది. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ సమ్మర్ క్యాంప్ మే 15న ప్రారంభమై జూన్ 14న ముగుస్తుంది. దేశవ్యాప్తంగా టొయోటా డీలర్‌షిప్/షోరూమ్‌లలో ఈ సమ్మర్ హాలిడే క్యాంప్ అందుబాటులో ఉంటుంది.
టొయోటా సమ్మర్ హాలిడే క్యాంప్‌కు తీసుకువచ్చే వాహనాలకు అక్కడి సర్వీస్ ఇంజనీర్లు 20-పాయింట్ ఫ్రీ చెకప్ చేసి ఏవైనా లోపాలుంటే సరిచేస్తారు. ఒకవేళ అవసరం అనుకుంటే తక్కువ ధరకే స్పేర్ పార్ట్‌లను కూడా టొయోటా డీలర్ నుండి కొనుగోలు చేయవచ్చు. కార్ ఇంటీరియర్ లుక్‌ను పెంచుకునేందుకు విడిభాగాలను కూడా ఆకర్షనీయమైన ధరలకే టొయోటా ఆఫర్ చేస్తుంది.
గడచిన సంవత్సరంలో కూడా ఇలాగే టొయోటా సమ్మర్ చెకప్ క్యాంప్‌ను నిర్వహించామని, అది ఘన విజయం సాధించడంతో ఈ సంవత్సరంలో కూడా తిరిగి సమ్మర్ హాలిడే క్యాంప్‌ను నిర్వహిస్తున్నామని టొయోటా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ సింగ్ తెలిపారు. సాధారణంగా వేసవి సెలవుల్లో ఎక్కువ మంది లాంగ్ జర్నీలు చేస్తుంటారు కాబట్టి, వారి వాహనాలను కండిషన్‌లో ఉండేలా చేసేందుకు ఈ ఉచిత సర్వీస్ క్యాంప్‌ను ఆఫర్ చేస్తున్నామని ఆయన వివరించారు. మరిన్ని వివరాలకు మీ సమీపంలో టొయోటా డీలర్‌షిప్‌ను సందర్శించండి.


Click it and Unblock the Notifications









