ఎఫ్‌జెడ్-ఎస్‌లో కొత్త వేరియంట్‌ని విడుదల చేసిన యమహా
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ఇండియా యమహా మోటార్ నుండి హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్న చీప్ అండ్ బెస్ట్ స్పోర్ట్స్ బైక్ ఎఫ్‌జెడ్-ఎస్‌లో ఓ సరికొత్త వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంజన్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా, బాడీ గ్రాఫిక్స్, ఎక్సీటీరియర్ లుక్‌లో కొద్దిపాటు మార్పులు చేర్పులు చేసి "ఫైరీ ఆరెంజ్" అనే కొత్త కలర్ ఆప్షన్‌తో యమహా ఈ సరికొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
కొత్త కలర్ (ఫైరీ ఆరెంజ్) చేరికతో యమహా ఎఫ్‌జెడ్-ఎస్ మొత్తం నాలుగు రంగులలో (బ్లాక్ సైబర్ గ్రీన్, సన్‌సెట్ రెడ్, కాంపిటీషన్ వైట్ మరియు ఫైరీ ఆరెంజ్) లభించనుంది. ఇకపోతే ఎఫ్‌జెడ్-16 మాత్రం లావా రెడ్, మిడ్-నైట్ బ్లాక్ ఆప్షన్లలో యధావిధిగా లభిస్తుంది. మరి ఇందులో కొత్తగా చేసిన మార్పులేంటంటే..
ఆల్టెర్ చేయబడిన పిలియన్ (వెనుక) సీట్: వెనుక కూర్చునే పిలియన్ రైడర్ సీట్ సౌకర్యంగా లేదని ఫిర్యాదులు రావడంతో, వెనుక సీట్‌ను కొద్దిగా మార్పులు చేసి, విశాలంగా తీర్చిదిద్దారు. ఈ మార్పు ఎఫ్‌జెడ్, ఎఫ్‌జెడ్-ఎస్ రెండింటికీ వర్తిస్తుంది.
సరికొత్త గ్రాబ్-రెయిల్: ఎఫ్‌జెడ్ సిరీస్ బైక్‌లలో ఓ సరికొత్త గ్రాబ్-రెయిల్ (వెనుకవైపు అమ్మాయిలు కూర్చుకున్న పట్టుకునేందుకు వీలుగా బైక్‌కు కుడివైపు సీట్ క్రింద అమర్చే లేడీస్ హ్యాండిల్)ను అమర్చారు. ఇది కేవలం బ్యాక్‌రెస్ట్‌గా మాత్రమే కాకుండా గతుకుల రోడ్లు, స్పీడ్ బ్రేకర్లపై రైడ్ చేసేటప్పుడు పిలియన్ రైడర్ కంఫర్ట్ కోసం ఇది ఉపయోగపడుతుందని యమహా పేర్కొంది.
ఆల్టెర్ చేయబడిన చైన్ కవర్: ఈ సరికొత్త యమహా ఎఫ్‌జెడ్ సిరీస్ బైక్‌లలో చైన్ గార్డును ఆల్టెర్ చేశారు. చైన్ క్రింది భాగాన్ని కూడా కవర్ చేసే విధంగా కొత్త చైన్ గార్డును అమర్చారు.
ఇకపోతే ధర, ఇంజన్ విషయంలో ఎలాంటి మార్పులు లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుత ధరకే ఈ కొత్త వెర్షన్ యమహా ఎఫ్‌జెడ్ సిరీస్ బైక్‌లు లభించనున్నాయి.


Click it and Unblock the Notifications









