త్వరలోనే నా కలం నిజం కాబోతుంది: 'దమ్ము' విలన్ కిషోర్

ఇటీవల విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమాలో విలన్ పాత్ర పోషించిన కిషోర్ గుర్తున్నాడా..? స్వతాహాగా కన్నడ నటుడైన కిషోర్ పలు తెలుగు సినిమాల్లో నటించి టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రత్యేకించి దమ్ము చిత్రంలో ఓ మంచి విలన్ పాత్రను పోషించిన కిషోర్‌ ఎంత కాలంగానో తాను కంటున్న ఓ కల త్వరలోనే నిజం కానుందట.

కిషోర్‌కు రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లంటే మహా ఇష్టం. ప్రస్తుతం కిషోర్ దగ్గర ఓ 350సీసీ పాత రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ (1994 మోడల్) ఉంది. కిషోర్ ఈ మోటార్‌సైకిల్‌ను మోడిఫై చేయించుకుని ఉపయోగిస్తున్నాడు. తన భార్యకు కూడా ఈ మోటార్‌సైకిల్ అంటే చాలా ఇష్టమని కిషోర్ చెప్పుకొచ్చాడు. ఇద్దరూ కలిసి ఈ బైక్‌పై జామ్ జామ్ అంటూ లాంగ్ జర్నీలు కూడా చేస్తారట.

ఇది లీటరు పెట్రోల్‌కు కేవలం 30 కి.మీ. మైలేజీనే ఇస్తున్నప్పటికీ, సాధారణ ప్యాసింజర్ కార్లతో పోల్చుకుంటే ఇదే ఎంతో బెస్ట్ అని చెప్పుకొస్తున్నాడు కిషోర్. కాగా.. కిషోర్‌ ఓ 500సీసీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను కొనాలని ఎప్పటినుండో కల కంటున్నాడట. ఆ కల త్వరలోనే నిజం కాబోతుందని కిషోర్ తెగ సంబర పడిపోతున్నాడు. గత కొద్ది నెలల క్రితమే కిషోర్ ఓ 500సీసీ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ బుల్లెట్ మోటార్‌సైకిల్‌ను బుక్ చేశాడు. మరికొద్ది రోజుల్లోనే ఈ మోటార్‌సైకిల్ కిషోర్ చేతికి రానుంది.

సాధారణంగా ఎవరైనా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను సొంతం చేసుకోవాలంటే బుక్ చేసుకున్న తర్వాత ఆరు నుండి ఎనిమిది నెలల వరకూ వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ బ్రాండ్‌కు అధిక డిమాండ్, తక్కువ ఉత్పత్తి సామర్థ్యం కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల వెయింటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు గానూ ఐషర్ మోటార్స్ (రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ మాతృ సంస్థ) చెన్నైలో ప్లాంటు మరో యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. అయితే, ఇది నిర్వహణలోకి రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టవచ్చని అంచనా.

Article Published On: Monday, April 30, 2012, 12:05 [IST]
English summary
Kannada actor Kishore who has been enjoying success across South Indian Cinema is celebrating it by buying himself a 500cc Royal Enfield Bullet. He already owns a 1992 Royal Enfield that he has used for long trips with his wife.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+