కొత్త 2012 టీవీఎస్ అపాచీలో కొత్తగా ఏముందంటే..
టీవీస్ మోటార్ కంపెనీ విడుదల చేసిన కొత్త అపాచీలో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏమీ లేవనే చెప్పవచ్చు. టీవీఎస్ విడుదల చేసిన కొత్త 2012 వెర్షన్ అపాచీ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మూడు వేరియంట్లలోనే (అపాచీ ఆర్‌టిఆర్ 160, అపాచీ ఆర్‌టిఆర్ 180, అపాచీ ఆర్‌టిఆర్ ఏబిఎస్) లభిస్తుంది.
అయితే, ఇందులో కోపంగా ఉండే కళ్ల నుండి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన ఎల్ఈడి పైలట్ హెడ్‌ల్యాంప్స్ ఈ కొత్త అపాచీకు సరికొత్త లుక్‌ను ఇవ్వనుంది. ఇంకా ఇందులో బ్లూకల్ ఇల్యుమినేషన్‌తో కూడిన రీడిజైన్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ (స్పీడోమీటర్ కన్సోల్), ఫ్యూయెల్ ట్యాంక్‌పై 3డి అక్షరాలతో కూడిన 'అపాచీ' లోగో (180 వేరియంట్‌లో మాత్రమే), రీడిజైన్ చేయబడిన స్ప్లిట్ ఫుట్ రెస్ట్స్, ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్, సరికొత్త ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్ వంటి మార్పులు ఉన్నాయి.
కొత్త అపాచీ ఆర్‌టిఆర్ 160 గ్రీన్, రెడ్, యల్లో, గ్రే రంగులలో డ్యూయెల్ టోన్ ఆప్షన్‌తో లభిస్తుంది. అలాగే, అపాచీ ఆర్‌టిఆర్ 180 వైట్, యల్లో, గ్రే, బ్లాక్ రంగులలో లభిస్తుంది. ఇకపోతే, అపాచీ ఆర్‌టిఆర్ 180 ఏబిఎస్ వైట్, బ్లాక్ రంగులలో మాత్రమే లభిస్తుంది. కొనుగోలుదారులను అసౌకర్యానికి గురి చేయకుండా ఉంచాలనే ఉద్దేశ్యంతో ముందుగా డీలర్‌షిప్‌లకు కొత్త అపాచీ స్టాక్‌ను డిశ్పాచ్ చేసిన తర్వాతే మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది.
ప్రస్తుతం కొత్త అపాచీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ టీవీఎస్ డీలర్‌షిప్ షోరూమ్‌లలో మూడు వేరియంట్లలో లభించనుంది. వీటి ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
* 2012 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 - రూ.67,505
* 2012 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 180 - రూ.72,090
* 2012 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 180 ఏబిఎస్ - రూ.82,780


Click it and Unblock the Notifications








