మూడు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చిన హీరో మోటోకార్ప్

Hero New Models
హీరో మోటటోకార్ప్ (గతంలో హీరో హోండా) బైక్‌లంటే ఇష్టపడే వారికి ఈ వార్త ఓ కొత్త సంవత్సర కానుక లాంటింది. ఎప్పటికప్పుడూ నూతన ఉత్పత్తులను ప్రవేశపెడుతూ తన మార్కెట్ స్థానాన్ని పదిలం చేసుకుంటున్న హీరో మోటోకార్ప్ తాజాగా మరో మూడు ఉత్పత్తులను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. కంపెనీ నుండి అత్యధికంగా అమ్మడువుకున్న 100సీసీ మోటార్‌సైకిల్ ప్యాషన్ బ్రాండ్‌లో "ప్యాషన్ ప్రో ఎక్స్" అనే ఓ కొత్త వేరియంట్‌ను హీరో మోటోకార్ప్ మార్కెట్లోకి విడుదల చేసింది.

అలాగే, గడచిన సంవత్సరంలో లండన్‌లో తమ కొత్త బ్రాండ్ లోగో ఆవిష్కరణ సందర్భంగా ప్రదర్శించిన 110సీసీ స్కూటర్ "హీరో మాస్ట్రో"తో పాటుగా ఓ కొత్త 125సీసీ బైక్ "హీరో ఇగ్నైటర్" అనే మోటార్‌సైకిల్‌ను కూడా కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మూడు మోడళ్లను కూడా హీరో బ్రాండ్ పేరిటే కంపెనీ విక్రయించనుంది. మరికొద్ది నెలల్లోనే ఇవి వాణిజ్యపరంగా మార్కెట్లో లభ్యం కానున్నాయి. వీటి ధరలు ఇతర వివరాలను వాణిజ్యపరంగా మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత వెల్లడిస్తామని కంపెనీ తెలిపింది.

అయితే, ఇక్కడ అసలు విషయం ఏంటంటే, హీరో మాస్ట్రో స్కూటర్, హీరో ఇగ్నైటర్ బైక్‌లు సేమ్ టు సేమ్ హోండా నుండి కాపీ కొట్టినవే. హోండా అందిస్తున్న 11సీసీ స్కూటర్ ఏవియేటర్‌లో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి దానిని మాస్ట్రో పేరిట, అలాగే హోండా అందిస్తున్న 125సీసీ బైక్ స్టన్నర్‌ను పేరు మార్చి ఇగ్నైటర్ పేరిట హీరో మోటోకార్ప్ విక్రయించే ప్రయత్నం చేస్తుంది. ఈ రెండు మోడళ్లు కూడా హోండా నుండి మార్కెట్లో అట్టర్ ప్లాప్ అయిన మోడళ్లే. మరి హీరో బ్రాండ్ పేరిట విక్రయిస్తే ఎంత మాత్రం సక్సెస్ అవుతాయో వేచిచూడాల్సిందే.

కాబట్టి ఇందులో కొత్తగా చెప్పుకోదగిన మోడల్ అంటే, హీరో ప్యాషన్ ప్రో ఎక్స్ మాత్రమే. ఇదిలా ఉండగా, కొత్త సంవత్సరంలో తమ సంస్థ మరింతగా ప్రజల్లోకి చొచ్చకుపోతుందన్న విశ్వాసిస్తున్నామని, గడచిన సంవత్సరంలో జపాన్ భాగస్వామి హోండా నుండి విడిపోయి తమ బ్రాండ్‌ పేరును మార్చినప్పటికీ ప్రజల్లో ఆదరణ ఎంత మాత్రమూ తగ్గలేదని హీరో మోటోకార్ప్‌ మేనేజింగ్ డైరెక్టర్ పవన్‌ ముంజాల్‌ అన్నారు. కాగా.. జనవరి నెలలోనే హీరో మ్యాస్ట్రో స్కూటర్‌ విడుదల కానుంది.

వాస్తవానికి హీరో మోటోకార్ప్‌కు ఇంకా సరైన సాంకేతిక భాగస్వామి లభించలేదు. ప్రస్తుతం హోండాతో 2014 వరకూ టెక్నాలజీ షేరింగ్ ఒప్పందం ఉంది కాబట్టి హోండా టెక్నాలజీని హీరో వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి, హీరో నుండి ఇప్పటికిప్పుడు మనం ఓ కొత్త ఉత్పత్తి ఊహించలేం. ఒకవేళ భవిష్యత్తులో కొత్త మోడళ్లు వచ్చినా.. అవి హోండా మోడళ్ల జెరాక్స్ కాపీలు అయి ఉండే ఆస్కారం ఉంది. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Thursday, January 5, 2012, 7:28 [IST]
English summary
Hero MotoCorp has unveiled three new models in Delhi before the 11th International Auto Expo. The models are the Maestro scooter, Ignitor and Passion Pro X motorcycles. The Maestro and the Ignitor are very similar to the Aviator and CB Stunner from Honda.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+