జపాన్ సునామీలో కొట్టుకొచ్చి కెనడా ఒడ్డున తేలిన బైక్

అయితే, ఈ ఫోటోలో కనిపిస్తున్న హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్ మాత్రం సముద్రంలో మునిగిపోకుండా, సంవత్సరం పాటు సముద్రంపై ప్రయాణం చేసి కెనడా ఒడ్డుకు చేరింది. జపాన్‌లోని ఇకుయో యోకోయమ అనే వ్యక్తికి చెందిన ఈ "హ్యార్లీ డేవిడ్‌సన్ నైట్ ట్రైన్" మోటార్‌సైకిల్ జపాన్ సునామీలో కొట్టుకుపోయి, సముద్రంపై సుమారు 5,000 కి.మీ. దూరం ప్రయాణించి కెనడా ఒడ్డుకు చేరింది.
యోకోయమ తన 2008 మోడల్ హ్యార్లీ డేవిడ్‌సన్ నైట్ ట్రైన్ మోటార్‌సైకిల్‌ను పార్క్ చేయడం కోసం ఓ పెద్ద కంటైనర్‌ను ఉపయోగించేవాడు. అందుకే ఇది సుముద్రంపై తేలుతూ కెనడా ఒడ్డుకు చేరింది. అయితే, ఉప్పునీటి కారణంగా ఈ బైక్ దాదాపు 50 శాతానికి పైగా తుప్పు పట్టి పోయింది. సంవత్సరం తర్వాత తన బైక్ తిరిగి దొరికిన ఆనందంతో యోకోయమ మాట్లాడుతూ.. తన బైక్ కనిపెట్టిన వ్యక్తికి మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేశాడు.
ఈ బైక్‌కు అమర్చిన నెంబర్ ప్లేట్ ద్వారా హ్యార్లీ డేవిడ్‌సన్ కెనడా యూనిట్ దాని యజమానిని గుర్తించి ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రస్తుతం ఈ బైక్‌ను మోడిఫై చేసి యధాస్థితికి తీసుకువచ్చి సదరు ఓనర్‌కు అప్పగించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ బైక్‌ను రిస్టోర్ చేయడానికి సుమారు 40,000 డాలర్లు ఖర్చు (కొత్తదాని కన్నా దాదాపు రెండింతలు ఎక్కువ) అవుతుందని అంచనా.


Click it and Unblock the Notifications








