హీరో బైక్‌ల ధరల పెంపు, త్వరలోనే కొత్త మోడళ్ల విడుదల
కాగా.. గడచిన ఆర్థిక సంవత్సరం (2011-12) మార్చి 31, 2012తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కంపనీ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. క్యూ4లో హీరో మోటోకార్ప్ నికర లాభం 20.33 శాతం వృద్ధిని సాధించి రూ.603.59 కోట్లు నమోదయ్యింది. అమ్మకాలు జోరుగా సాగటమే ఇందుకు ప్రధానకారణం. ఇదివరకటి ఆర్థిక సంవత్సరం (2010-11)లో మార్చి 31, 2011తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.501.61 కోట్లుగా ఉంది.
ఇకపోతే, ఇదే కాలానికి కంపెనీ మొత్తం ఆదాయం రూ.5,471.30 కోట్ల నుంచి రూ.6,139.90 కోట్లకు పెరిగాయి. క్యూ4లో హీరో మోటోకార్ప్ మొత్తం 15,72,027 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించగా, మొత్తం 2011-12 ఆర్థిక సంవత్సరానికి గాను 62,35,205 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. పూర్తి సంవత్సరంలో 15.41 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేశామని, మొత్తం టర్నోవర్ 21.55 శాతం పెరిగి 23,579 కోట్ల రూపాయలకు, నికర లాభం 2,378 కోట్లకు చేరిందని హీరోమోటోకాప్ చైర్మన్ బ్రిజ్‌మోహన్‌లాల్
జపాన్ భాగస్వామి హోండా నుండి విడిపోయిన తర్వాత తామేమీ ఒంటరి ప్రయాణం చేయటం లేదని, భారతీయులంతా తమ వెంట ఉన్నారని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆకర్షనీయమైన ఉత్పత్తులను తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, గడచిన జనవరిలో జరగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన హైబ్రిడ్ స్కూటర్ 'లీప్', 100 సిసి ప్యాషన్ ఎక్స్‌ప్రో, 125 సిసి బైక్ ఇగ్నిటార్‌లను త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తామని, డీలర్ నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా దేశవ్యాప్తంగా మరో 400 టచ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నామని సంస్థ ఎండి పవన్ ముంజాల్ తెలిపారు.


Click it and Unblock the Notifications









