రూ.47,804 కొత్త సిబి షైన్‌ను విడుదల చేసిన హోండా

జపాన్ ద్విచక్ర వాహన కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న 125సీసీ మోటార్‌సైకిల్ 'సిబి షైన్'లో మరో కొత్త వేరియంట్‌ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. గడచిన జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో సరికొత్త కలర్ ఆప్షన్లతో కూడిన రిఫ్రెష్డ్ హోండా సిబి షైన్‌ను హోండా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

మాన్‌సూన్ గ్రే మెటాలిక్, ఫోర్స్ సిల్వర్ మెటాలిక్ అనే రెండు ఆకర్షనీయమైన రంగుల్లో కొత్త సిబి షైన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ రిఫ్రెష్డ్ వెర్షన్ సిబి షైన్ 125సీసీ మోటార్‌సైకిల్‌లో తొలిసారిగా ట్యూబ్‌లెస్ టైర్లను హోండా ఆఫర్ చేస్తుంది. సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌తో లభించనున్న ఈ 2012 వెర్షన్ సిబి షైన్ ధర రూ.47,804 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, ఎలక్ట్రిక్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్ యధావిధిగా లభిస్తాయి.


తొలిసారిగా భారత మార్కెట్లో హోండా సిబి షైన్‌ను 2006వ సంవత్సరంలో కంపెనీ విడుదల చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ కూడా ఈ మోడల్ హోండా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హోండా షైన్‌ బ్లాగ్, జెనీ గ్రే మెటాలిక్, రెబల్ రెడ్ మెటాలిక్ రంగుల్లో కూడా లభ్యం కానుంది. హోండా సిబి షైన్‌లో ఉపయోగించిన 125సీసీ ఆప్టిమ్యాక్స్ ఇంజన్ 10.3 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని డెలివరీ చేస్తుంది. ఈ ఇంజన్‌లో ఉపయోగించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఇది తక్కువ ఆర్‌పిఎమ్ వద్ద ఎక్కువ టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఈ ఇంజన్ స్మూత్ రైడ్ అనుభూతిని కల్పిస్తుంది. ఇందులో అమర్చిన ఆప్షనల్ డిస్క్ బ్రేక్ మంచి బ్రేకింగ్ కాన్ఫిడెన్స్‌ను కలిగిస్తుంది. ఇంకా ఇందులో మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ, విస్కౌస్ ఎయిర్ ఫిల్టర్, టఫ్ప్-అప్ ట్యూబ్స్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి. సిబి షైన్‌లో అమర్చిన 3-స్టెప్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఎలాంటి రోడ్లపై అయినా సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని కల్పిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 3, 2012, 18:50 [IST]
English summary
Honda Motorcycles and Scooter India Ltd has just launched the refreshed CB Shine with the starting price of Rs 47,804 (ex-showroom, Delhi). New CB Shine now comes in 2 new colours - Force Silver Metallic and Monsoon Grey Metallic. It also gets new graphics on the fuel tank, side cover, rear cowl and the front visor, while two of the Shine’s variants now come with tubeless tyres as standard.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+