50 లక్షల అమ్మకాల మార్కును తాకిన పల్సర్ బైక్
బజాజ్ ఆటో నుండి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న పల్సర్ మోటార్‌సైకిళ్ల మరో సరికొత్త మైలురాయిని అధిగమించాయి. ద్విచక్ర వాహనీల తయారీలో ఇండియాలో రెండవ స్థానంలో ఉన్న బజాజ్ ఆటో, ఇప్పటి వరకూ 50 లక్షల పల్సర్ బ్రాండ్ మోటార్‌సైకిళ్లను విక్రయించామని కంపెనీ పేర్కొంది. పల్సర్ బ్రాండ్‌ను భారత మార్కెట్‍కు పరిచయం చేసి 10 ఏళ్లు పూర్తయిన తర్వాత ఈ రికార్డును స్థాపించామని బాజాజ్ ఆటో తెలిపింది.
బజాజ్ ఆటో తొలిసారిగా పల్సర్ బైక్‌ను నవంబర్ 2001లో మార్కెట్లోకి విడుదల తొలుత కేవలం 150సీసీ, 180సీసీ ఇంజన్ వేరియంట్లలోనే లభ్యమవుతున్న పల్సర్‌లో 135సీసీ, 200సీసీ (ప్రస్తుతం ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేశారు), 220సీసీ వేరియంట్లను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా పల్సర్ బైక్‌ను కూడా కంపెనీ నవీకరించుకుంటూ వచ్చింది.
ఇందులో భాగంగనే, బజాజ్ ఆటో మరో సరికొత్త తరం (నెక్స్ట్ జనరేషన్) పల్సర్‌ను అభివృద్ధి చేసి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. వాస్తవానికి గత నెలలోనే మార్కెట్లో విడుదల కావల్సిన కొత్త "పల్సర్ 200 ఎన్ఎస్" మోడల్ విడుదలను కంపెనీ వాయిదా వేసుకుంది. బహుశా ఈ నెలలోనైనా కొత్త పల్సర్‌కు విడుదల యోగ్యం ఉందో లేదో వేచి చూడాల్సి ఉంది.
కొత్త 'పల్సర్ 200ఎన్ఎస్' (నేక్‌డ్ స్పోర్ట్స్)లో ప్రపంచంలోనే తొలిసారిగా ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీతో కూడిన 199.5సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9500 ఆర్‌పిఎమ్ వద్ద 23.4 బిహెచ్‌పిల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 1.86 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.
పల్సర్ 200ఎన్ఎస్ బైక్ కేవలం 3.8 సెకన్లలోనే 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది, అలాగే 9.8 సెకన్లలో 0-100 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది గంటకు గరిష్టంగా 136 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. కొత్త 2012 పల్సర్ 200ఎన్ఎస్ లీటర్ పెట్రోల్‌కు 58 కి.మీ (గంటకు 55 కి.మీ. వేగంతో వెళ్లినప్పుడు మాత్రమే) మైలేజీనివ్వనుంది.


Click it and Unblock the Notifications








