టాటా ఆరియాను లాంజ్‌లా కస్టమైజ్ చేసిన దిలీప్ చాబ్రియా
చవక కార్లను సైతం ఖరీదైన కార్లుగా వాటి రూపు రేఖలు మార్చేయగల ఆటోమోటివ్ డిజైన్ మాంత్రికుడు దిలీప్ చాబ్రియా మరో అద్భుతాన్ని సృష్టించారు. వివిధ కంపెనీల కార్లను తనదైన శైలిలో కస్టమైజ్ చేయటంలో దిలీప్ చాబ్రియాకు సాటి మరొకరు రారనే చెప్పవచ్చు. ఇటీవలే దిలీప్ చాబ్రియా, టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం కారు టాటా ఆరియాను అత్యంత విలాసవంతమైన 'లాంజ్' కారులా తీర్చిదిద్దారు.
టాటా ఆరియాలోని వెనుక రెండు వరుసలలోని సీట్లను స్థానంలో రెండు విశాలమైన సీట్లను అమర్చి లోపలి ఇంటిరీయర్స్‌ను ఆకర్షనీయంగా తీర్చిదిద్దటం జరిగింది. డ్రైవర్‌తో సంబంధం లేకుండా ఈ క్యాబిన్‌ను డిజైన్ చేశారు. ఇందులో పెద్ద ఎల్‌సిడి స్కీన్‌ను, మంచి సౌండ్ సిస్టమ్‌ను, ఓ యాపిల్ ఐప్యాడ్‌ను అమర్చారు. ఇందులో అమర్చిన సీట్లు అత్యంత సౌకర్యవంతంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి.
ఇందులో ఉపయోగించిన సీట్లు, డోర్ ట్రిమ్స్, లెథర్ ఫినిషింగ్, ఉడ్ కోటెడ్ ప్లాస్టిక్స్ మరింత లగ్జరీ ఫీల్‌ను అందిస్తాయి. డిసి డిజైన్ ఇప్పటికే, అంబాసిడర్, నానో, ఇన్నోవా వంటి అనేక కార్లను కస్టమైజ్ చేసి కార్ ప్రియులను ఆకట్టుకుంది. గత జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కూడా డిసి డిజైన్ ఓ సరికొత్త సూపర్ కారు 'డిసి అవంతి'ని మార్కెట్‌కు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
డిసి డిజైన్ సంస్థ రూపొందించిన ఈ అవంతి సూపర్ కారును వాణిజ్య పరంగా మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది. మంచి స్పోర్టీ లుక్‌నిచ్చేలా రూపొందించిన డిజైన్, ఎల్ఈడి హెడ్‌లైట్స్ ఈ కారులో ప్రధాన ఆకర్షగా నిలుస్తాయి. అంతేకాకుండా.. ఇందులో ఉపయోగించిన ఫోర్డ్ ఎకోబూస్ట్ 2.0 లీటర్ ఫోర్-సిలిండర్ డిఓహెచ్‌సి 6-వాల్వ్ ఇంజన్, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 240 బిహెచ్‌పిల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 366 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.
అవంతి సూపర్ కారు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇంకా ఇందులో ఏబిఎస్, ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఏబిఎస్ సిస్టమ్‌ను ప్రముఖ విడిభాగాల తయారీ సంస్థ బోష్ అందిస్తుంది. ప్రారంభ దశలో భాగంగా 300 అవంతి కార్లను ఉత్పత్తి చేయాలని డిసి డిజైన్స్ యోచిస్తోంది. భారత మార్కెట్లో ఈ సూపర్ కారు ధర రూ.30 లక్షల వరకూ ఉండొచ్చని. ఇదే గనుక మార్కెట్లోకి విడుదలైతే, భారత్‌లో అత్యంత చవక ధరకే లభించనున్న సూపర్ కారుగా డిసి అవంతి చరిత్ర సృష్టించనుంది.


Click it and Unblock the Notifications









