జాగ్రత్త బ్రదర్.. మిమ్మల్ని మూడో కన్ను గమనిస్తుంది
ప్రస్తుతం అన్ని ప్రధాన మెట్రో నగరాల్లోనూ, ట్రాఫిక్ నిబంధనలు ఎక్కువగా ఉల్లంఘించే ప్రదేశాల్లోనూ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ సిసిటివి కెమరాలను అమర్చి కంట్రోల్ సెంటర్ నుండి వాహన రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. ఈ హైటెక్ టెక్నాలజీ కారణంగా ట్రాఫిక్ హద్దులు మీరిన వారిని గుర్తించి జరిమానా చలానాలను సదరు వాహన యజమానికి ఇంటికి చిరుమానాకు పంపించడం జరుగుతుంది.
ఒకవేళ తప్పు చేసిన వారు ఎప్పుడైనా ట్రాఫిక్ పోలీసులదొరికిపోయారే అనుకోండి.. పాత తప్పులన్నీ లెక్కగట్టి ఒకేసారి వసూలు చేస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌లో అమర్చిన సిసిటివి కెమరాల సాయంతో కంట్రోల్ రూమ్‌లో ఉండే పోలీసులు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వారి వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లను ట్రేస్ చేసి డేటా బేస్‌లో ఫీడ్ చేస్తారు. పోలీసుల వద్ద ఉండే బ్లాక్‌బెర్రీ ఫోన్ల సాయంతో ఈ డేటాబేస్‌ను యాక్సెస్ చేసి స్పాట్‌లోనే కాంపాక్ట్ బ్లూటూత్ ప్రింటర్ల సాయంతో చలానాలు ప్రింట్ చేసి జరిమానాను వసూలు చేస్తారు.
సిగ్నల్ ట్రాఫిక్ పోలీసు లేనంత మాత్రానా డిపార్ట్‌మెంట్ డ్యూటీ చేస్తుండటం లేదనుకుంటే పొరపాటే. ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి ఎవరెవరు ఏయే తప్పులు చేస్తున్నారో అన్నింటినీ మూడో కన్ను పర్యవేక్షిస్తూనే ఉంటుంది. మీ టైమ్ బ్యాడ్ అయ్యి పోలీసులకు దొరికిపోతే మీ తప్పుల చిట్టా మొత్త బయటకు వస్తుంది. కాబట్టి, ట్రాఫిక్ సిగ్నల్స్‌లో గ్రీన్ సిగ్నల్ పడే వరకూ వేచి ఉండి, లైన్ క్రాస్ చేయకుండా సురక్షితంగా ప్రయాణించండి. జరిమానాల నుండి తప్పించుకోండి. హ్యావ్ ఏ హ్యాపీ జర్నీ.


Click it and Unblock the Notifications









