హోండా మోటార్‌సైకిల్ కంపెనీకు సోపేస్తున్న కర్ణాటక సర్కార్..!

DV Sadananda Gowda
హీరో హోండా జాయింట్ వెంచర్ నుండి విడిపోయిన తర్వాత భారత మార్కెట్లో మంచి పటుత్వాన్ని సాధించుకునేందుకు జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ) ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందులో భాగాంగానే, ఇండియాలో తమ మూడో ప్లాంటు ఏర్పాటుకు గానూ కంపెనీ బెంగుళూరును ఎంచుకున్న సంగతి తెలిసిందే.

అసలే ఆటోమొబైల్ కంపెనీలు ప్లాంట్లు అంత మాత్రంగా ఉన్న కర్ణాటకకు హోండా ప్లాంట్ రావడంతో ఆ రాష్ట్రం సంబరపడిపోతుంది. అంతేకాకుండా.. హోండా నుండి ఇండియాలో మరిన్ని పెట్టుబడులను స్వాగతించేదుకు గానూ పన్నులపై అదనపు రాయితీలను ఆఫర్ చేస్తోంది. హెచ్ఎమ్ఎస్ఐకు వ్యాట్ చెల్లింపుపై వాయిదాను పొడిగించడం, రిజిస్ట్రేషన్ ఫీజ్‌ను మినహాయించడం వంటి ఆఫర్లతో కర్ణాటక సర్కార్ హోండాతో పాటుగా ఇతర ఆటోమొబైల్ కంపెనీలను ఆకర్షిస్తోంది.

ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి డివి సదానంద గౌడ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో 40 శాతం వ్యాట్ పేమెంట్‌ను 10 సంవత్సరాలకు వాయిదా వేస్తూ క్యాబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం 11వ సంవత్సరంలో కంపెనీ అరియర్లను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కర్ణాటక సర్కారు ఇక్కడొక మెళిక కూడా పెట్టింది. ఈ ప్లాంటు ద్వారా స్థానికంగా 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించడం తప్పనిసరి అని న్యాయ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎస్ సురేష్ కుమార్ అన్నారు.

ఇలా 80 శాతం స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కంపెనీ విఫలమైనట్లయితే, జారీ చేసిన ప్రోత్సాహకాలను వెనక్కు తీసేసుకుంటామని ఆయన ఖరాకండిగా తేల్చి చెప్పేశారు. ఏటా 18 లక్షల వాహనాలు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో, కోలార్ జిల్లాలోని నర్సాపూర్‌లో నిర్మిస్తున్న ఈ ప్లాంటు కోసం హోండా దాదాపు రూ.1,300 కోట్ల పెట్టుబడులను వెచ్చిస్తోంది. ఈ ప్లాంటు ద్వారా 3,200 మందికి ప్రత్యక్షంగానూ, 1,500 మందికి పరోక్షంగానూ ఉపాధి లభించనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 18, 2012, 17:40 [IST]
English summary
The Karnataka government today decided to extend the deferred VAT payment and exemption from registration fee, among others, to the Honda Motorcycle and Scooter India Ltd's (HMSI) unit coming up at Narasapur in Kolar district in the state.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+