కవాసకి నిన్జా 650ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేసిన బజాజ్

కవాసకి నిన్జా 650ఆర్ విడుదల గురించి ఇదివరకటి కథనంలో తెలుగు డ్రైవ్ స్పార్క్ ప్రచురించినట్లుగానే, బజాజ్ ఆటో ఈ సరికొత్త స్పోర్ట్స్ బైక్‌ను నేడు మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో ద్వారా జపాన్‌కు చెందిన కవాసకి భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశీయ విపణిలో ఈ సరికొత్త కవాసకి నిన్జా 650ఆర్ స్పోర్ట్స్ బైక్ ధర రూ.4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

కొత్త 2012 వెర్షన్ కవాసకి నిన్జా 650ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను స్టయిలిష్ లుక్, పర్‌ఫుల్ పెర్ఫామెన్స్‌లతో తీర్చిదిద్దారు. సరికొత్త బాడీ ప్యానెల్స్, ఫ్యూయెల్ ట్యాంక్‌పై ఇగ్నిషన్ కీ, ఎల్ఈడి కన్సోల్, అనలాగ్ టాకోమీటర్, ఎల్ఈడి బ్రేక్ లైట్స్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఈ బైక్ సొంతం. కవాసకి నిన్జా 650ఆర్‌లో ఉపయోగించిన 649సీసీ ఫోర్-స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, డిఓహెచ్‌సి, 4-వాల్వ్ ఇంజన్‌ 71 బిహెచ్‌పిల శక్తిని, 65 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

కవాసకి నిన్జా 650ఆర్ ఫోటో గ్యాలరీ

కొత్త కవాసకి నిన్జా 650ఆర్ కేవలం 12.06 సెకండ్ల సమయంలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 200 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. సరికొత్త 2012 వెర్షన్ కవాసకి నిన్జా 650ఆర్ స్పోర్ట్స్ బైక్ మూడు ఆకర్షనీయమైన రంగుల్లో (మెటాలిక్ స్పార్క్ బ్లాక్, క్యాండీ లైమ్ గ్రీన్, ప్యాషన్ రెడ్) లభిస్తుంది. భారత మార్కెట్లో దీని ధర 4,99,834 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 9, 2012, 15:17 [IST]
English summary
Bajaj Auto just launched the all new ‎2012 version Kawasaki Ninja 650R in India At Price 4.99 Lakhs (ex showroom, Delhi). The new sports bike has received several updates both on the design front and in features.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+