2013 సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్‌ను ఆవిష్కరించిన హోండా

జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా ఓ సరికొత్త మోటార్‌సైకిల్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇటు ఆఫ్-రోడ్ ప్రియులను అటు ఆన్-రోడ్ ప్రియులను ఆకట్టుకునేలా హోండా అభివృద్ధి చేసిన 'హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్' మోటార్‌సైకిల్ కంపెనీ ఆసియా మార్కెట్ల కోసం తయారు చేసింది. ఇటీవలే ఇండోనేషియాలో జరిగిన 2012 జకార్తా మోటార్ షోలో హోండా ఈ పవర్‌ఫుల్ 150సీసీ బైక్‌‌ను ఆవిష్కరించింది. హోండా మోటార్‌సైకిల్ అందిస్తున్న హోండా సిబిఆర్ 250 స్పోర్ట్స్ బైక్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని కంపెనీ తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టిన హోండా సిబిఆర్ 150 ఫ్లాట్‌ఫామ్‌పై ఈ హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్ బైక్‌ను అభివృద్ధి చేశారు.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్ మోటార్‌సైకిల్ తొలుతగా ఇండోనేషియా మార్కెట్లలోను అనంతరం ఆసియా మార్కెట్లలోను (ఇండియాతో కలిపి) విడుదల కానుంది. హోండా సిబి డాజ్లర్ డిజైన్ నుంచి స్ఫూర్తి ఈ మోటార్‌సైకిల్‌ను డిజైన్ చేశారు. ఏదేమైనప్పటికీ, ఈ రెండు మోడళ్లతో (సిబిఆర్ 15ఆర్, సిబి డాజ్లర్) పోల్చుకుంటే సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్ విభిన్నమైన లుక్, పెర్ఫామెన్స్‌, హ్యాండ్లింగ్‌ను కలిగి ఉండనుంది. ఇది నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో (వైట్, బ్లాక్, ట్రైకలర్, ఆరెంజ్) లభ్యం కానుంది.

హోండా సిబిఆర్ 150ఆర్ స్ట్రీట్‌ఫైర్‌
హోండా సిబిఆర్ 150ఆర్ స్ట్రీట్‌ఫైర్‌
హోండా సిబిఆర్ 150ఆర్ స్ట్రీట్‌ఫైర్‌
హోండా సిబిఆర్ 150ఆర్ స్ట్రీట్‌ఫైర్‌
హోండా సిబిఆర్ 150ఆర్ స్ట్రీట్‌ఫైర్‌
హోండా సిబిఆర్ 150ఆర్ స్ట్రీట్‌ఫైర్‌
హోండా సిబిఆర్ 150ఆర్ స్ట్రీట్‌ఫైర్‌
హోండా సిబిఆర్ 150ఆర్ స్ట్రీట్‌ఫైర్‌

సింపుల్‌గా చెప్పాలంటే, కంపెనీ ప్రస్తుతం అందిస్తున్న హోండా సిబిఆర్ 150ఆర్‌కు నేక్డ్ వెర్షనే ఈ హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్. ఇందులో అమర్చిన 150సీసీ, డిఓహెచ్‌సి, 4-వాల్వ్, సింగిల్ సిలిండర్-లిక్విడ్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 18 బిహెచ్‌పిల శక్తిని, 12.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఆరు గేర్లు) సిస్టమ్‌తో లభిస్తుంది. దేశీయ విపణిలో బజాజ్ అందిస్తున్న పల్సర్ 200ఎన్ఎస్ మోటార్‌సైకిల్‌కు ఇది గట్టి పోటీగా నిలువనుంది. భారత మార్కెట్లో దీని ధర రూ.99,000 (ఎక్స్-షోరూమ్)లుగా ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Friday, November 9, 2012, 17:59 [IST]
English summary
Honda has revealed the CB150R which looks very similar to its big brother at the Jakarta, Motorcycle Show, Indonesia. The big question is, whether this model would off-road to India? Drivespark believes it will in the coming days and put up a stiff fight in the 150cc commuter segment. We take a closer look at Honda CB150R offering.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+