లగ్జరీ సైకిల్ మార్కెట్లోకి ప్రవేశించిన హీరో సైకిల్స్
ఈ మేరకు కార్బన్ ఫ్రేమ్‌తో తయారు చేసిన ప్రీమియం సైకిల్ 'రెడ్ డాట్'ను దేశీయ విపణిలోకి విడుదల చేస్తున్నామని, మార్కెట్లో దీని ధర రూ.43,000 గా నిర్ణయించామని హీరో సైకిల్స్ పేర్కొంది. అర్బన్ ట్రైల్ బ్రాండ్ కింద 17 కొత్త మోడళ్లను అందిస్తున్నామని, వీటి ధరలు రూ. రూ.10,000 నుంచి రూ.43,000 వరకూ ఉన్నాయని కంపెనీ తెలిపింది.
ఈ సైకిళ్లను కార్బన్ పైబర్‌తో తయారు చేయబడ్డాయి. ఫార్ములా వన్ (ఎఫ్1) రేస్ కార్లు, విమానాల తయారీలో కూడా ఈ తరహా కార్బన్ ఫైబర్‌నే ఉపయోగిస్తారు. ఈ పదార్థం తేలికగా ఉండటమే కాకుండా ఉక్కు కన్నా ధృడంగా ఉండి, తుప్పు పట్టదు. హీరో సైకిల్స్ తాజాగా విడుదల చేసిన కార్బన్ ఫైబర్ రెడ్ డాట్ సైకిల్‌ను బరువు కేవలం 12.9 కేజీలు మాత్రమే.
అభివృద్ధి చెందుతున్న నగరాలు, అర్బన్ మార్కెట్లో, ఫారిన్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని ఈ లగ్జరీ సైకిళ్లను విడుదల రూపొందించడం జరిగిందని కంపెనీ పేర్కొంది. ప్రీమియం సైకిళ్ల అమ్మకాల కోసం హీరో సైకిల్స్ స్వతహాగా 30 అవుట్‌లెట్లను ప్రారభించనుంది. లుథియానాలో ప్లాంటులో ప్రీమియం సైకిళ్ల తయారీ కోసం రూ.50 కోట్ల పెట్టుబడులను హీరో సైకిల్స్ వెచ్చించనుంది.


Click it and Unblock the Notifications









