ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్ 'ది మోన్‌స్టర్'
ఈ ఫోటోలో ఉన్న వాహనాన్ని చూశారా..? ఇదేదో దెయ్యం బైక్‌లా ఉందనుకుంటున్నారా..? నిజమే ఇది దెయ్యం బైకే. అయితే, దెయ్యాలు ఉపయోగించే బైక్ మాత్రం కాదండోయ్.. దీని పేరు "మోన్‌స్టర్" (దెయ్యం) మోటార్‌సైకిల్. ప్రపంచంలోనే అతి పెద్ద మోటార్‌సైకిల్‌గా గిన్నిస్ రికార్డు సాధించిన బైక్ ఇది.
తూర్పు జర్మనీలోని జిల్లాహ్ అనే గ్రామానికి చెందిన టిలో నీబెల్, అతని బృందం ఈ బైక్‌కు రూపకల్పన చేశాయి. దీనిని పూర్తిగా చేతులతోనే తయారు చేశారు. దీని బరువు సుమారు ఐదు టన్నులు. అలాగే, దీని పొడవు ఐదున్నర మీటర్లు. సోవియట్ ట్యాంక్స్‌లో ఉపయోగించే టి55 ఇంజన్‌ను ఉపయోగించి ఈ బైక్‌ను తయారు చేశారు. ఈ ఇంజన్ 800 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది.
గిన్నిస్ బుక్ అధికారులు గుర్తించిన దాని ప్రకారం దీని బరువు 4,740 కిలోలు. సోవియట్ కార్ షెల్, రష్యన్ ట్యాంక్ టి55 ఇంజన్‌ను ఉపయోగించి టిలో ఈ బైక్‌ను తయారు చేశాడు. దీని భారీ బైక్‌ను కంట్రోల్ చేయాలంటే, టూ-మీటర్ డ్రైవ్‌ను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ బైక్ తయారీలో ఉపయోగించిన ఫ్రేమ్, స్ప్రింగ్స్, సస్పెన్షన్ తదితర విడిభాగాలను మిలటరీ స్క్రాప్ (చెత్త) నుండి సేకరించబడ్డాయి.


Click it and Unblock the Notifications









