యాక్ససరీస్: విశిష్టమైన వెస్పా డెస్క్ అలారమ్ క్లాక్స్
వెస్పా.. ఈ ఇటాలియన్ టూవీలర్ బ్రాండ్ గురించి మనకు పెద్దగా పరిచయాలు అసరం లేదు. టూవీలర్ సెగ్మెంట్లో కొత్త ఒరవడులకు నాంది పలికిన ఈ 19వ శతాబ్ధపు వెస్పా స్కూటర్లంటే ఇప్పటికే కొందరికి మక్కువే. ప్రస్తుతం అత్యాధునిక ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి రావటం వెస్పా ఓ చరిత్రగా మిగిలిపోయింది. క్లాసిక్ లుక్, కంఫర్టబల్ రైడ్ వెస్పా స్కూటర్ల ప్రత్యేకత. మర్చిపోతున్న వెస్పా బ్రాండ్‌ను గుర్తు చేసేందుకు కంపెనీ, ఇదిగో ఇలా విభిన్న వస్తువులను తయారు చేసి, ప్రజలో మనసుల్లో తన స్థానాన్ని పదిలపరుచుకుంటోంది.
వెస్పా అందిస్తున్న ఈ ఘఢియారాలను చూడండి.. వెస్పా స్కూటర్ హెడ్‌లైట్ ఆకారంలో ఉండే ఈ టేబుల్ డెస్క్ అలారమ్‌లను, కంపెనీ మొట్టమొదటిసారిగా 1946వ సంవత్సరంలో విడుదల చేసిన స్కూటర్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసింది. అప్పటి స్కూటర్ హెడ్‌లైట్లు ఈ అలారమ్ క్లాక్ మాదిరిగానే ఉండేవి. ఒరిజినల్ వెస్పా సిగ్నేచర్, నాణ్యమైన మెటల్ కేసింగ్, క్రోమ్ బెజల్, స్పష్టమైన లెన్స్ వంటి విశిష్టలతో ఇవి లభిస్తాయి. ఈ వెస్పా క్లాక్‌లను వెస్పా డీలర్‌షిప్‌ల నుంచి కానీ లేదా ఆన్‌లైన్ ద్వారా కానీ కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్ మార్కెట్లో వీటి ధర 35 డాలర్లు (సుమారు రూ.1500)గా ఉంది.

వెస్పా డెస్క్ అలారమ్ క్లాక్స్

వెస్పా డెస్క్ అలారమ్ క్లాక్స్

వెస్పా డెస్క్ అలారమ్ క్లాక్స్

వెస్పా డెస్క్ అలారమ్ క్లాక్స్

వెస్పా డెస్క్ అలారమ్ క్లాక్స్

వెస్పా డెస్క్ అలారమ్ క్లాక్స్

వెస్పా డెస్క్ అలారమ్ క్లాక్స్

వెస్పా డెస్క్ అలారమ్ క్లాక్స్

వెస్పా డెస్క్ అలారమ్ క్లాక్స్

వెస్పా డెస్క్ అలారమ్ క్లాక్స్



Click it and Unblock the Notifications








