తలాష్ చిత్రంలో మహీంద్రా స్టాలియోపై అమీర్ ఖాన్ సవారీ
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, అందాల భామలు రాణి ముఖర్జీ, కరీనా కపూర్ ప్రధాన తారాగణంగా రూపొందిన ‘తలాష్' చిత్రం నేడు థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఓ హత్య కేసు నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇందులో అమీర్ ఖాన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించారు. ఈ చిత్రానికి రీమా కాగ్టి దర్శకత్వం వహించగా, రితేష్ సిద్వాని, అమీర్ ఖాన్, ఫరాన్ అక్తర్‌లు సంయుక్తంగా దీనిని నిర్మించారు. ఈ చిత్రం కోసం నిర్మాతలు సుమారు 45 కోట్ల రూపాయల వెచ్చించినట్లు సమాచారం.
కాగా.. తలాష్ సినిమాలో మన హిట్ హీరో ఓ ఫ్లాప్ బైక్‌పై కనిపిస్తాడు. ఇండియన్ మార్కెట్లో విడుదలై ఒక్క ఏడాది కూడా గడవకుండానే అటకెక్కిన 'మహీంద్రా స్టాలియో' 110సీసీ మోటార్‌సైకిల్‌పై దర్శనమిస్తాడు. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్)కు చెందిన ద్విచక్ర వాహన విభాగం 'మహీంద్రా టూ వీలర్స్ లిమిటెడ్' (ఎమ్‌టిడబ్ల్యూఎల్) స్టాలియో బైక్ విడుదలతో మోటార్‌సైకిల్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. 2010లో కంపెనీ ఈ బైక్‌ను విడుదల చేసింది.

మహీంద్రా స్టాలియో - తలాష్

మహీంద్రా స్టాలియో బ్రాండ్ అంబాసిడర్ - అమీర్ ఖాన్

మహీంద్రా స్టాలియో - అమీర్ ఖాన్

మహీంద్రా స్టాలియో

మహీంద్రా స్టాలియో

మహీంద్రా స్టాలియో

మహీంద్రా స్టాలియో

మహీంద్రా స్టాలియో - తలాష్
అప్పట్లో ఈ కంపెనీ అమీర్ ఖాన్‌ను మహీంద్రా స్టాలియోకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. తలాష్ చిత్రం షూటింగ్ కూడా రెండేళ్ల క్రితమే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తన తలాష్ చిత్రంలో కూడా స్టాలియో బైక్‌ను ప్రమోట్ చేసేందుకు మహీంద్రా, అమీర్ ఖాన్‌ను ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ మోటార్‌సైకిల్ గేర్ బాక్సులో సమస్యలు తలెత్తుతున్నాయని వరుస ఫిర్యాదులు అందడంతో కంపెనీ దీని ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపి వేసిన సంగతి తెలిసిందే.
అయితే, తాజా అప్‌డేట్ ప్రకారం, మహీంద్రా స్టాలియోలోని లోపాలను సవరించి, మరికొన్ని అదనపు మార్పులు చేర్పులు చేసి 'పాంటెరో' అనే సరికొత్త పేరుతో త్వరలోనే విపణిలో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. మహీంద్రా పాంటెరో తయారీ కోసం ఇటలీకు చెందిన డిజైన్ సేవల సంస్థ "ఇంజనీర్స్ ఇంజనీరింగ్"తో మహీంద్రా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కొత్తగా రానున్న అప్‌గ్రేడెడ్ మహీంద్రా పాంటెరో ఈ సెగ్మెంట్లోని హోండా డ్రీమ్ యుగ, హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో, సుజుకి హయాటే వంటి 110సీసీ మోటార్‌సైకిళ్లకు పోటీగా నిలువనుంది.
తలాష్ సినిమా స్టోరీ లైన్..
ఈ చిత్రం కథ విషయానికొస్తే.. రోషిణి (రాణి ముఖర్జీ)తో షెఖావత్ (అమీర్ ఖాన్)కి వివాహం అయిన కొంతకాలం తర్వాత వారిద్దరూ విడిపోతారు. ఆ తర్వాత రోషిణి సమాజ సేవికగా మారిపోతుంది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కొన్ని కేసుల పరిశోధనలో వేశ్య రోసీ (కరీనా కపూర్)తో షెఖావత్‌కి పరిచయం ఏర్పడుతుంది. ఆ తరువాత ప్రారంభమైన వెదుకులాటతో ముగ్గురి జీవితాల్లోను జరిగే సంఘటనలే సస్పెన్స్ థ్రిల్లర్‌ని చేస్తాయి.


Click it and Unblock the Notifications








