ఆండ్రాయిడ్‌తో పనిచేయనున్న రియర్ వ్యూ మిర్రర్స్

ఇప్పటి వరకూ కేవలం వెనుక వైపు ఉండే వాహనాలను మాత్రమే చూసేందుకు ఉపయోగించే రియర్ వ్యూ మిర్రర్ భవిష్యత్తులో ఇన్-కార్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోనుంది. ప్రస్తుతం ఉన్న అధునాత రియర్ వ్యూ మిర్రర్స్‌ను కారు వెనుక వైపు అమర్చిన కెమరాకు కనెక్ట్ చేయబడేవి.
ఇలా చేయడం వలన వెనుక వైపు వచ్చే వాహనాలు కారు లోపల మధ్య భాగంలో అమర్చిన రియర్ వ్యూ కెమెరాలో తిలకించేందుకు వీలుండేది, అంతేకాకుండా, దీని వలన పార్కింగ్ చేయడం కూడా సులువు అవుతుంది. అయితే, ఈ అధునాతం ఆండ్రాయిడ్ ఆధారిత రియర్ వ్యూ మిర్రర్, ఈ కేవలం పై రెండి ప్రయోజనాలను మాత్రమే కాకుండా మరెన్నో అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండనుంది.
టచ్-స్క్రీన్ ఆప్షన్ కలిగిన ఈ రియర్ వ్యూ మిర్రర్ ద్వారా మ్యూజిక్ సిస్టమ్‌ను కూడా నియంత్రించుకోవచ్చు. రైడీన్ రూపొందించిన ఈ కాన్సెప్ట్ రియర్ వ్యూ మిర్రర్ 2013 నాటికి వాణిజ్య పరంగా అందుబాటులోకి రానుంది. లాస్ వేగాస్‌లో జరిగిన ఓ ప్రదర్శనలో రైడీస్ ఈ గ్యాడ్జెట్‌ను ప్రదర్శించింది.


Click it and Unblock the Notifications








