టీవీఎస్ స్కూటీ ప్రచారకర్తగా హీరోయిన్ అనుష్కా శర్మ

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న స్కూటర్లకు మరింత గ్లామర్‌ను తగిలించనుంది. ప్రముఖ బాలీవుడ్ నటి 'అనుష్కా శర్మ'ను ఉత్పత్తులకు ప్రచారకర్త (తమ బ్రాండ్ అంబాసిడర్)గా నియమించుకుంది. త్వరలోనే అనుష్కా శర్మతో షూట్ చేసిన సరికొత్త టెలివిజన్ కమర్షియల్ (వాణిజ్య ప్రకటన)లను కంపెనీ విడుదల చేయనుంది.

తమ బ్రాండ్‌ను యువతకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో అనుష్కా శర్మను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్నామని టీవీఎస్ మోటార్ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. టీవీఎస్ అందిస్తున్న స్కూటీ రేంజ్ ఉత్పత్తులకు ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రచారం చేయనుంది. టీవీఎస్‌కు పోటీగా హీరో మోటోకార్ప్, మహీంద్రా 2వీలర్స్ అందిస్తున్న స్కూటర్లకు ఇప్పటికే బాలీవుడ్ తారలు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో టీవీఎస్ కూడా వారి బాటలోనే ఈ బాలీవుడ్ భామను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్నట్లు పేర్కొంది.


బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సరసన 'రబ్ నే బనాది జోడి' చిత్రంతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన అనుష్కా శర్మ అనతి కాలంలోనే మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో, తమ స్కూటీ బ్రాండ్‌కు అనుష్కా శర్మ చక్కగా సరిపోతుందని, తమ ఉత్పత్తులకు ఆమె ప్రచారం నిర్వహించటం ద్వారా స్కూటర్ల అమ్మకాలు జోరందుకోగలవని టీవీఎస్ మోటార్ కంపెనీ అధ్యక్షుడు హెచ్ ఎస్ గోయింది వెల్లడించారు.

బాలీవుడ్ తారలు కేవలం బాలీవుడ్ మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా గుర్తింపును కలిగి ఉన్న కారణంగా, ప్రధానంగా ఆటోమొబైల్ కంపెనీలన్నీ వారినే బ్రాండ్ అంబాసిడర్‌లుగా నియమించుకోవటం జరుగుతుంది. ఇటీవలే సుజుకి విడుదల చేసిన హయాటేకు సల్మాన్ ఖాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోగా.. హోండా విడుదల చేసిన డ్రీమ్ యుగ మోటార్‌సైకిల్‌కు అక్షయ్ కుమార్‌ను ప్రచారకర్తగా నియమించుకున్న సంగతి తెలిసిందే.

మన మార్కెట్లో లభిస్తున్న వివిధ ద్విచక్ర వాహనాలు, వాటి బ్రాండ్ అంబాసిడర్‌ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
* హీరో కరిజ్మా జెడ్ఎమ్ఆర్ - హృతిక్ రోషన్
* హోండా డ్రీమ్ యుగ - అక్షయ్ కుమార్
* సుజుకి హయాటే - సల్మాన్ ఖాన్
* యమహా ఎఫ్‌జెడ్ సిరీస్ - జాన్ అబ్రహామ్
* హీరో ఇంపల్స్ - రణబీర్ కపూర్
* టీవీఎస్ స్టార్ సిటీ సిరీస్ - మహేంద్ర సింగ్ ధోనీ
* హీరో ప్లెజర్ స్కూటర్ - ప్రియాంకా చోప్రా
* మహీంద్రా డ్యూరో - కరీనా కపూర్
* టీవీఎస్ స్కూటీ - అనుష్కా శర్మ

More from DriveSpark

Article Published On: Tuesday, June 12, 2012, 13:47 [IST]
English summary
TVS the Chennai based two wheeler manufacturer has added some oomph to its brand image by roping in Bollywood actress Anushka Sharma as the brand ambassador for its Scooty range of scooters. TVS in its statement has said that Anushka's signing as its brand ambassador was aimed to strengthen its brand image among the youth.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+