గంటకు 80 కి.మీ. వేగంతో పరుగులు పెట్టే ఆడి సైకిల్
మోటార్‌సైకిల్ మాదిరిగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే సైకిల్ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఊహించుకోవటం ఎందుకు ఈ ఊహను నిజం చేసి చూపించి జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ బ్రాండ్ ఆడి. ఆడి కార్లను తయారు చేయడంలోనే ఫేమస్ కాదు. సైకిళ్ల డిజైనింగ్‌లో మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉంది. తాజాగా.. ఆడి ఓ సరికొత్త ఈ-బైక్‌ను రూపొందించింది.
ఆడి డిజైన్ చేసిన ఈ-బైక్ కేవలం ఒక్క స్విచ్ నొక్కగానే సాధారణ సైకిల్ వేగంతో వెళ్లే ఈ-బైక్ కాస్తా రయ్.. మని మోటార్‌సైకిల్ వేగంతో పరుగులు పెడుతుంది. 'ఆడి ఈ-బైక్ వర్థర్‌సీ' అనే ఈ ఎలక్ట్రిక్ బైక్ గంటకు గరిష్టంగా 80 కి.మీ. వేగంతో పరుగులు పెడుతుంది. మోటార్ రేసింగ్ డిజైన్ సూత్రాలను ఆధారంగా తయారు చేసుకొని కంపెనీ ఈ ఈ-బైక్‌ను తయారు చేసింది.
సైకిల్ తొక్కి అలసిపోయిన రైడర్‌కు విశ్రాంతిని కల్పించేందుకు గానూ ఇందులో ఓ ఎలక్ట్రిక్ మోటార్ అమర్చారు. సైకిల్ ఫ్రేమ్‌లో అమర్చిన బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఈ మోటార్ పనిచేస్తుంది. ఈ సైకిల్‌లో ప్యూర్ మోడ్, పెడెలెక్, ఈ-గ్రిప్ అని మొత్తం ఐదు మోడ్‌లు ఉంటాయి. దీనిని పూర్తిగా సాధారణ సైకిల్ మాదిరిగానూ లేదా పూర్తిగా ఎలక్ట్రి మోటార్ ఆధారంగానూ నడపవచ్చు.
పెడలింగ్ చేసేటప్పుడు, విడుదలయ్యే శక్తి ద్వారా ఇందులో అమర్చబడిన బ్యాటరీ ఛార్జింగ్ అయ్యే సదుపాయం కూడా ఆడి ఈ-బైక్‌లో ఉంది. ఆడి ఈ-బైక్ వర్థర్‌సీలో అవసరమైన మోడ్‌లు ఫీచర్లు ఎంచుకోవడానికి గానూ ఇందులో టచ్ స్క్రీన్‌తో కూడిన చిన్నపాటి కంప్యూటర్ ఉంటుంది. సైక్లిస్ట్ తన వద్ద ఉండే స్మార్ట్ ఫోన్ సహాయంతో కూడా ఈ కంప్యూటర్‌కు కనెక్ట్ అయ్యి మొబైల్ ద్వారానే దీనిని నియంత్రించవచ్చు.
హెల్మెట్‌కు అమర్చబడి ఉండే కెమెరా సాయంతో రియల్ టైమ్ ఫోటోలు, వీడియోలను స్మార్ట్ ఫోన్ సహాయంతో ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సైకిల్‌కు అమర్చబడి ఉండే కంప్యూటర్‌పై ఫేస్‌బుక్ స్టేటస్ మెసేజ్‌లను కూడా పొందవచ్చు. సైకిల్ వీలీ చేయడంలో నైపుణ్యం లేని వారి కోసం ఇందులో 'పవర్ వీలీ' అనే మోడ్ ఉంటుంది. అలాగే, స్పోర్టింగ్ ఛాలెంజెస్ కోసం 'బ్యాలెన్స్‌డ్ వీలీ' అనే మోడ్ కూడా ఉంటుంది. ఇందులో ఆడి సిగ్నేచర్‌ను తలపించేలా ఎల్‌ఈడి లైట్లు కూడా ఉంటాయి.


Click it and Unblock the Notifications









