హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుకు వెళితో పెట్రోల్ పోయరు!

అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని జార్ఖండ్ రాష్ట్రంలోని పరిపాలనా విభాగం సరికొత్త ఆదేశాలను జారీ చేసింది. హెల్మెట్ ధరించకుండా పెట్రోల్ బంకులకు వెళితే పెట్రోల్‌ను పెట్రోల్ ఫిల్ చేయకూడదని అదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాంచీ డిప్యూటీ కమీషనర్ కెకె సోన్, పెట్రోల్ బంకు యజమానులకు కొన్ని సూచనలు జారీ చేశారు. పెట్రోల్ బంకులలో హెల్మెట్ లేకపోతే పెట్రోలో పోయమని, హెల్మెట్ ధరించికుండా వచ్చే వారిని గుర్తించేందుకు బంకులలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఒకవేళ ఎవరైనా హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుకు వచ్చి బలవంతంగా పెట్రోల్ పోయమని బెదిరిస్తే వారి వాహనాపు రిజిస్ట్రేషన్ నెంబర్‌ను నమోదు చేసుకొని ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ నిబంధనను ఉల్లఘిస్తే.. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి)లోని సెక్షన్ 188 ప్రకారం వారికి జరిమానా కూడా విధించడం జరుగుతుంది. గతంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కూడా ఈ తరహా ఆంక్షలు జారీ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








